బి.కొత్తకోట: స్థానిక సింహం వీధిలోని ఓ మొబైల్ దుకాణంలో బుధవారం రాత్రి 9గంటల సమయంలో సెల్‌ఫోన్ పేలింది. ఓ యువ తి తన మొబైల్ ఫోన్‌కు సేఫ్‌గార్డ్ వేయించుకునేందుకు వచ్చింది. షాపు యజమాని ఆ సెల్‌ను తీసుకున్న కొంతసేపటికి అది పేలి గోడవైపు దూసుకుపోయింది. దీనిదెబ్బకు అద్దాలు పగిలాయి. సెల్ పూర్తిగా కాలిపోయింది. బ్యాటరీ పేలడంవల్ల ఇలా జరిగిందని దుకాణ యజమాని చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు.
Comments
Please login to add a commentAdd a comment