cell phone blast
-
వేరే దేశం నుంచి కాల్.. సెల్‌ఫోన్ పేలి గాయాలు
వేలూరు: వాలాజలో సెల్‌ఫోన్ పేలి ఎలక్ట్రీషియన్‌కు తీవ్ర గాయాలైన సంఘటన సంచలనం రేపింది. నేతాజీ వీధికి చెందిన వెంకటేశన్(32) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో వెంకటేశన్ ఇంటిలో ఉన్నాడు. ఆ సమయంలో అతని సెల్‌కు ఇతర దేశానికి చెందిన నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ ఆన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించగా పెద్ద శబ్దంతో పేలింది. ఈ ప్రమాదంలో వెంకటేశన్ తల, చెయ్యి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే వాలాజలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వేలూరు అడుక్కంబరైలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇతర దేశానికి చెందిన నంబర్ నుంచి కాల్ రావడంతో ఎందుకు పేలింది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రాణిపేట డీఎస్పీ గీత తీవ్ర గాయాలైన వెంకటేశన్ వద్ద విచారణ చేపట్టారు. ముందు సెల్‌ఫోన్ పేలిందని.. మరోసారి ఇంటి సమీపంలోని చెత్తకు నిప్పు పెడుతుంటే అందులో ఉన్న గుర్తు తెలియని వస్తువు పేలిందని సమాధానం చెప్పాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు. -
మాట్లాడుతుండగా పేలిన సెల్‌ఫోన్
హొసూరు, బనశంకరి: బైక్‌మీద వెళ్తూ స్మార్ట్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా ఫోన్ పేలిపోయింది. పేలుడుతో కంగారుపడిన ద్విచక్రవాహనదారుడు కిందపడి గాయపడ్డాడు. సూళగిరి సమీపంలోని కురుబరపల్లికి చెందిన ఆర్ముగం ఆదివారం బైక్ మీద ఆనేకల్ వద్ద వస్తుండగా కాల్ రావడంతో సెల్ఫోన్లో మాట్లాడుతూనే బైక్ నడుపుతున్నారు. మాట్లాడుతూ ఉండగానే సెల్‌ఫోన్ పెద్ద శబ్దంతో పేలింది. చెవికి, కణతకు గాయాలయ్యాయి. కిందపడిపోయాడు. గాయపడిన ఆర్ముగంను స్థానికులు సూళగిరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతన్ని పోలీసులు విచారించి కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
పేలిన సెల్‌ఫోన్
బి.కొత్తకోట: స్థానిక సింహం వీధిలోని ఓ మొబైల్ దుకాణంలో బుధవారం రాత్రి 9గంటల సమయంలో సెల్‌ఫోన్ పేలింది. ఓ యువ తి తన మొబైల్ ఫోన్‌కు సేఫ్‌గార్డ్ వేయించుకునేందుకు వచ్చింది. షాపు యజమాని ఆ సెల్‌ను తీసుకున్న కొంతసేపటికి అది పేలి గోడవైపు దూసుకుపోయింది. దీనిదెబ్బకు అద్దాలు పగిలాయి. సెల్ పూర్తిగా కాలిపోయింది. బ్యాటరీ పేలడంవల్ల ఇలా జరిగిందని దుకాణ యజమాని చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. -
ప్రకాశం జిల్లా మర్రిపూడిలో పేలిన సెల్‌ఫోన్
-
పేలిన రెడ్మీ 5ఏ స్మార్ట్‌ఫోన్
శాలిగౌరారం(తుంగతుర్తి) : శాలిగౌరారంలో శనివారం స్మార్ట్‌ఫోన్ పేలింది. యువకుడు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణపాయం తప్పింది. వివరాలు.. శాలిగౌరారం గ్రామపంచాయతీ పరిధిలోని మార్కెట్‌కాలనీకి చెందిన రావుల సురేశ్ అనే యువకుడు నాలుగు నెలల క్రితం నల్లగొండలోని ఓ ప్రముఖ మొబైల్ దుకాణంలో ఎంఐ(రెడ్మీ)–5ఏ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసి వినియోగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యాహ్నం సెల్‌ఫోన్ అకస్మాత్తుగా స్విచ్ఆఫ్ కావడంతో పాటు ఆ సెల్‌ఫోన్ నుం చి చిన్నపాటి శబ్దం వస్తుండడంతో ఆ సెల్‌ఫోన్‌ను చూపించేందుకని వెంటనే మండలకేంద్రంలోని ఓ సెల్‌ఫోన్ రిపేర్షాపువద్దకు వెళ్లాడు. తనషర్ట్ జేబులో నుంచి ఆ సెల్‌ఫోన్‌ను తీసి షాపులోని టేబుల్‌పై పెడుతుండగానే ఒక్కసారిగా సెల్‌ఫోన్ నుంచి మంటలు వచ్చాయి. గమనించిన సురేశ్‌తో పాటు షాపు నిర్వాహకుడు వెంటనే బయటకు పరుగెత్తుతుండగానే పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో చుట్టుపక్కల షాపుల నిర్వాహకులు ఏమి జరిగిందోనని భయాందోళనకు గురయ్యారు. సురేశ్ ఏ మాత్రం ఆలస్యం చేసినా అతని జేబులోనే ఆ సెల్‌ఫోన్ పేలి ఉండేది. ఒకవేళ అదే జరిగితే సురేశ్ ప్రాణానికే ముప్పు వాటిల్లేది. దీంతో సురేశ్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మండలకేంద్రంలో జరిగిన ఈ సంఘటన గంటల వ్యవధిలోనే ప్రజలకు తెలియడంతో ప్రతి ఒక్కరూ సెల్ఫోన్ల వాడకంపై కొంత ఆందోళనకు గురయ్యారు. -
పేలిన సెల్‌ఫోన్
గుంటూరు జిల్లా/ మాచవరం : చార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్ అకస్మాత్తుగా పేలడంతో తృటిలో పెను ప్రమాదం తప్పిన ఘటన మాచవరంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక కొట్ల బజారులో ఫొటోస్టాట్ దుకాణ యజమాని శంకర్రావు తన సెల్‌ఫోన్‌ను ప్రతి రోజులాగే చార్జింగ్ పెట్టి , తన పనిలో నిమగ్నమయ్యాడు. చార్జింగ్ అవుతున్న సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు వచ్చాయి. వెంటనే మంటలు అంటుకున్న సెల్‌ఫోన్ ను బయటకు విసిరివేసాడు. దీంతో దుకాణానికి మంటలు అంటుకోపోవడంతో ప్రమాదం తప్పిందని, సెల్‌ఫోన్ విలువ రూ. 10 వేల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. -
ఐసీడీఎస్ కార్యాలయంలో పేలిన సెల్‌ఫోన్
వీరఘట్టం విజయనగరం : అంగన్వాడీ కేంద్రాల వివరాలు నమోదు చేసేందుకు ప్రభుత్వం అందించిన స్మార్ట్‌ఫోన్ పేలిపోయింది. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో సోమవారం ఈ ఘటన జరిగింది. దీంతో భయభ్రాంతులకు గురైన అంగన్వాడీ కార్యకర్తలు ఉరుకులు పరుగులు తీశారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఐసీడీఎస్ కార్యాలయంలో సమావేశం ఉండటంతో అంగన్వాడీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. సూపర్ వైజర్ రాకపోవడంతో చేబియ్యంవలస అంగన్వాడీ కార్యకర్త ఎం.వెంకటమ్మ ప్రభుత్వం అందించిన స్మార్ట్‌ఫోన్‌లో అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సమయంలో ఫోన్ ఒక్కసారిగా వేడెక్కి పొగలు రావడంతో వెంటనే విసిరేశారు. తర్వాత పెద్ద శబ్దంతో ఫోన్ పేలిపోయిందని ఆమె తెలిపారు. దూరంగా విసిరేయడంతో ప్రమాదం తప్పిందని వివరించారు. ఆరు నెలల కిందట వీరఘట్టం ప్రాజెక్టు పరిధిలోని 143మంది అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం కార్బన్ స్మార్ట్ఫోన్లను అందజేసింది. వీటిలో అంగన్వాడీ కేంద్రాల సమాచారం, కేంద్రాల పరిధిలో ఉన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల వివరాలతో పాటు కేంద్రంలో ఉన్న స్టాకు వివరాలు మొబైల్లో నమోదు చేయాలి. ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల ఈ ఫోన్లు చార్జింగ్ పెట్టేటప్పుడు పేలిపోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరో సంఘటన జరగడంతో ప్రభుత్వం ఇచ్చిన సెల్ఫోన్లు ఉపయోగించేందుకు మిగిలిన అంగన్వాడీ కార్యకర్తలు భయపడుతున్నారు. -
ఫోన్ పేలి యువకుడి మృతి
నార్నూర్(ఆసిఫాబాద్): గాదిగూడ మండలం ముత్యంబట్టి గ్రామానికి చెందిన లాకడే నానేశ్వర్(20) సెల్‌ఫోన్ పేలి సోమవారం మృతిచెందాడు. ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. లాకడే నానేశ్వర్ వ్యవసాయ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఉదయం తన వద్ద ఉన్న మైక్రోమాక్స్ ఫోన్ ఇంట్లో చార్జింగ్ పెట్టాడు. అరగంట తర్వాత ఫోన్ రింగ్ కావడంతో చార్జింగ్ ఉండగానే మాట్లాడుతుండగా ఒక్కసారిగా పేలింది. దీంతో షాక్‌కు గురై నానేశ్వర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి కాశీరాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చేతిలో సెల్‌ఫోన్ పేలి వ్యక్తి దుర్మరణం
-
పేలిన సెల్‌ఫోన్ ; బాలుడికి తీవ్ర గాయాలు
సాక్షి, కర్నూలు : ఇటీవలి కాలంలో సెల్ఫోన్లు చేతుల్లో పేలుతుండటంతో వినియోగదారులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సెల్ఫోన్లో పాటలు వింటున్న బాలుడి చేతిలో ఫోన్ బ్యాటరీ పేలిపోయింది. ఈ ఘటన జిల్లాలోని తుగ్గలి మండలం పెండేకల్లులో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భాస్కర్ ఆచారి అనే బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుడిచేతి వేళ్లు కూడా తెగిపడినట్టు సమాచారం. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సెల్‌ఫోన్ పేలి బాలుడికి గాయాలు
-
శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో పేలిన సెల్‌ఫోన్
కాజీపేటరూరల్: సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి ఒక ప్రయాణికుడి సెల్‌ఫోన్ పేలింది. దీంతో బోగీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. కాజీపేట రైల్వే పోలీస్ అధికారుల కథనం ప్రకారం.. వినోద్‌సింగ్ అనే ప్రయాణికుడు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లోని చైర్‌కార్ సీ-2 కోచ్‌లో సీట్ నంబర్ 55-56 వద్ద ప్రయాణిస్తున్నాడు. రైలు కాజీపేట జంక్షన్ యార్డు దాటుతున్న క్రమంలో చార్జింగ్ పెట్టిన అతడి సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో పొగలు వ్యాపించగా ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళన చెందారు. రైలులో ఏదో జరిగిందని ఉలిక్కి పడ్డారు. వెంటనే బోగీలో ఉన్న టిక్కెట్ కండక్టర్ రైలు చైయిన్ లాగి ఆపారు. సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టగా పేలిందని తెలుసుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైల్వేఅధికారులు, పోలీసులు బోగీలోకి వెళ్లి తనిఖీ చేసి జరిగిన విషయం తెలుసుకొని రైలును విజయవాడకు పంపించారు. ఈ ఘటన కారణంగా శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట యార్డులో 10 నిమిషాలపాటు అధికారులు నిలిపివేశారు. తర్వాత రైలు వరంగల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లిన తర్వాత శాతవాహన ఎక్స్‌ప్రెస్ చైర్‌కార్ బోగీని తనిఖీ చేసి పంపించినట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ కంట్రోల్ రూంకు సమాచారం అందించినట్లు తెలిపారు. -
బసినేపల్లి తండాలో పేలిన సెల్‌ఫోన్
గుత్తి రూరల్: బసినేపల్లి తండాలో జీఆర్పీ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్‌కు చెందిన సెల్‌ఫోన్ శనివారం పేలింది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటేష్ నాయక్ ఏడాది కిందట ఆన్లైన్ ద్వారా మొబైల్ కొనుగోలు చేసి తన భార్యకు ఇచ్చాడు. రోజు మాదిరిగా వినియోగిస్తున్న ఆమె సెల్‌ఫోన్ శనివారం చార్జింగ్ అయిపోవడంతో పక్కన పెట్టి.. ఇంట్లో పని చేసుకుంటోంది. ఇంతలో పెద్ద శబ్ధం వచ్చింది. ఫోన్ పేలి పొగలు వస్తున్నాయి. అంత వరకూ పిల్లలు ఫోన్లో గేమ్స్ ఆడుకున్నారని, ఆ సమయంలో చేతిలో పేలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని వారు కానిస్టేబుల్ దంపతులు వాపోయారు. చార్జింగ్ అయిపోయిన ఫోన్ దానంతట అదే ఆన్ అయి పేలి ఉంటుందని కానిస్టేబుల్ అనుమానం వ్యక్తం చేశాడు. -
సెల్‌ఫోన్ పేలితే ఇల్లు కూలుతుందా...?
మదనపల్లి: సెల్‌ఫోన్ పేలితే ఇల్లు కూలుతుందా... అని మదనపల్లె పట్టణంతోపాటు జిల్లా ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలోని గౌతమినగర్‌లో అన్నపూర్ణ ఇంటిలో ఆదివారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఇల్లు కూలిపోయి అన్నపూర్ణ మామ సుబ్రమణ్యం మృతి చెందాడు. సెల్ ఫోన్ పేలడంతోనే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రకటించారు. ప్రజలు మాత్రం ఈ పేలుడుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏమి జరిగింది, గ్యాస్ సిలిండర్ పేలలేదు... షార్ట్ సర్క్యూట్ జరగడానికి కరెంటు మీటర్ బాగానే ఉంది. బాంబులు వేసినట్టు ఆనవాళ్లు కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. మరి అంత పేలుడు ఎలా సంభవించిందన్న ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది. సోమవారం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. గోడ శిథిలాలను తొలగించి పేలుడుకు గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు. బాంబులు వేయడం వల్లే గోడ కూలిందా...? లేక ఆ ప్రదేశంలో ఇంటికి అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించేందుకు ఇంటిలో ఉంచిన మందు పదార్ధాలు పేలాయా? సుబ్రమణ్యం మాంత్రికుడు కావడంతో ఎవరైనా దుండగులు ఈ దురాగాతానికి పాల్పడ్డారా ? అన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. కూలిపోయిన ఇంటిలో నాలుగేళ్ల క్రితం చనిపోయిన సుబ్రమణ్యం చిన్న కుమారుడు మంజుబాబు భార్య ఒక్కతే కాపురం ఉంటోంది. ఆమె కూడా రోజువారి కూలి పనులకు వెళ్తోంది. ఆమెను పోలీసులు విచారిస్తున్నారు.