గుంటూరు జిల్లా/ మాచవరం : చార్జింగ్ పెట్టిన సెల్‌ఫోన్ అకస్మాత్తుగా పేలడంతో తృటిలో పెను ప్రమాదం తప్పిన ఘటన మాచవరంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక కొట్ల బజారులో ఫొటోస్టాట్ దుకాణ యజమాని శంకర్‌రావు తన సెల్‌ఫోన్‌ను ప్రతి రోజులాగే చార్జింగ్ పెట్టి , తన పనిలో నిమగ్నమయ్యాడు. చార్జింగ్ అవుతున్న సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు వచ్చాయి. వెంటనే మంటలు అంటుకున్న సెల్‌ఫోన్ ను బయటకు విసిరివేసాడు. దీంతో దుకాణానికి మంటలు అంటుకోపోవడంతో ప్రమాదం తప్పిందని, సెల్‌ఫోన్ విలువ రూ. 10 వేల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment