గుత్తి రూరల్: బసినేపల్లి తండాలో జీఆర్పీ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్‌కు చెందిన సెల్‌ఫోన్ శనివారం పేలింది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటేష్ నాయక్ ఏడాది కిందట ఆన్‌లైన్ ద్వారా మొబైల్ కొనుగోలు చేసి తన భార్యకు ఇచ్చాడు. రోజు మాదిరిగా వినియోగిస్తున్న ఆమె సెల్‌ఫోన్ శనివారం చార్జింగ్ అయిపోవడంతో పక్కన పెట్టి.. ఇంట్లో పని చేసుకుంటోంది. ఇంతలో పెద్ద శబ్ధం వచ్చింది. ఫోన్ పేలి పొగలు వస్తున్నాయి. అంత వరకూ పిల్లలు ఫోన్‌లో గేమ్స్ ఆడుకున్నారని, ఆ సమయంలో చేతిలో పేలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని వారు కానిస్టేబుల్ దంపతులు వాపోయారు. చార్జింగ్ అయిపోయిన ఫోన్ దానంతట అదే ఆన్ అయి పేలి ఉంటుందని కానిస్టేబుల్ అనుమానం వ్యక్తం చేశాడు.