basinepalli thanda
-
ట్రాక్టర్ బోల్తా..డ్రైవర్ మృతి
గుత్తిరూరల్: మండలంలోని బసినేపల్లి తండా శివార్లలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జి.ఎర్రగుడి వద్ద పొలంలో మంగళవారం ట్రాక్టర్ టిల్లర్ అదుపు తప్పి గుంతలో పడి డ్రైవర్ బండారు నాగరాజు(35) మృతి చెందాడు. వివరాలు. జి.ఎర్రగుడికి చెందిన బండారు నాగరాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ శివార్లలో పొలంలో పెద్ద రాళ్లను ట్రాక్టర్ టిల్లర్‌తో తొలగించేందుకు వెళ్లాడు. వెనుక వైపు గుంత ఉంటడం గమనించకుండా ట్రాక్టర్ రివర్స్‌లో వేగంగా తీసుకెళ్లడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ నాగరాజుపై ట్రాక్టర్ పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య యమున, ఇద్దరు వికలాంగ కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బసినేపల్లి తండాలో పేలిన సెల్‌ఫోన్
గుత్తి రూరల్: బసినేపల్లి తండాలో జీఆర్పీ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్‌కు చెందిన సెల్‌ఫోన్ శనివారం పేలింది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటేష్ నాయక్ ఏడాది కిందట ఆన్లైన్ ద్వారా మొబైల్ కొనుగోలు చేసి తన భార్యకు ఇచ్చాడు. రోజు మాదిరిగా వినియోగిస్తున్న ఆమె సెల్‌ఫోన్ శనివారం చార్జింగ్ అయిపోవడంతో పక్కన పెట్టి.. ఇంట్లో పని చేసుకుంటోంది. ఇంతలో పెద్ద శబ్ధం వచ్చింది. ఫోన్ పేలి పొగలు వస్తున్నాయి. అంత వరకూ పిల్లలు ఫోన్లో గేమ్స్ ఆడుకున్నారని, ఆ సమయంలో చేతిలో పేలి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని వారు కానిస్టేబుల్ దంపతులు వాపోయారు. చార్జింగ్ అయిపోయిన ఫోన్ దానంతట అదే ఆన్ అయి పేలి ఉంటుందని కానిస్టేబుల్ అనుమానం వ్యక్తం చేశాడు.