పేలిన సెల్‌ఫోన్‌ ; బాలుడికి తీవ్ర గాయాలు | Cell Phone Blasted In Boy Hand In Kurnool | Sakshi
Sakshi News home page

పేలిన సెల్‌ఫోన్‌ ; బాలుడికి తీవ్ర గాయాలు

Published Sun, Jul 29 2018 7:55 PM | Last Updated on Sun, Jul 29 2018 8:19 PM

Cell Phone Blasted In Boy Hand In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : ఇటీవలి కాలంలో సెల్‌ఫోన్లు చేతుల్లో పేలుతుండటంతో వినియోగదారులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సెల్‌ఫోన్‌లో పాటలు వింటున్న బాలుడి చేతిలో ఫోన్‌ బ్యాటరీ పేలిపోయింది. ఈ ఘటన జిల్లాలోని తుగ్గలి మండలం పెండేకల్లులో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భాస్కర్‌ ఆచారి అనే బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుడిచేతి వేళ్లు కూడా తెగిపడినట్టు సమాచారం. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement