సెల్‌ఫోన్ పేలి గాయపడిన ఆర్ముగం (ఇన్‌సెట్) పేలిన సెల్‌ఫోన్
హొసూరు, బనశంకరి: బైక్‌మీద వెళ్తూ స్మార్ట్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా ఫోన్ పేలిపోయింది. పేలుడుతో కంగారుపడిన ద్విచక్రవాహనదారుడు కిందపడి గాయపడ్డాడు. సూళగిరి సమీపంలోని కురుబరపల్లికి చెందిన ఆర్ముగం ఆదివారం బైక్ మీద ఆనేకల్ వద్ద వస్తుండగా కాల్ రావడంతో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూనే బైక్ నడుపుతున్నారు. మాట్లాడుతూ ఉండగానే సెల్‌ఫోన్ పెద్ద శబ్దంతో పేలింది. చెవికి, కణతకు గాయాలయ్యాయి. కిందపడిపోయాడు. గాయపడిన ఆర్ముగంను స్థానికులు సూళగిరిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతన్ని పోలీసులు విచారించి కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment