
బెంగళూరు: ద్విచక్ర వాహనాన్ని తాకాడన్న కారణంతో దళితుడిపై దాడి చేసిన అనాగరిక ఘటన శనివారం కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. విజయపుర జిల్లా మినాజీ గ్రామానికి చెందిన ఓ దళితుడు అనుకోకుండా ఉన్నత కులానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌ను ముట్టుకున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన అగ్ర కులస్థులు అతనిపై మూకదాడి చేశారు. అతని బట్టలూడదీసి గొడ్డును బాదినట్టు బాదడమే కాక అతని కుటుంబాన్ని కూడా రోడ్డుపైకి ఈడ్చి వారిపైనా దాడి చేశారు. దీంతో బాధితుడు తనకు జరిగిన దారుణాన్ని వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దాడికి పాల్పడ్డ 13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరోవైపు ఈ మూకదాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇందులో కొందరు దళితుడిని గట్టిగా అదిమి పట్టుకోగా మరికొందరు అతన్ని ఇష్టారీతిన కొట్టారు. అతని కుటుంబ సభ్యులపైనా విచక్షణారహితంగా దాడి చేశారు. (నిక్కరు సైజులో తేడా, పోలీసులకు ఫిర్యాదు!)
Comments
Please login to add a commentAdd a comment