
దొడ్డబళ్లాపురం: పసిరిక పాము ఒకటి బైక్‌లో చే రుకుని రిపేరీ చేస్తుండగా ప్రత్యక్షమై మెకానిక్ ను, బైక్ యజమానికి షాక్‌కు గురిచేసిన సంఘటన నెలమంగలలో జరిగింది. వీవర్స్ కాలనీలో మంగళవారం మధ్యాహ్నం రేణుకయ్య అనే వ్యక్తి తన బైక్‌ను రిపేరీ చేయించడానికి ఓ మెకానిక్ దగ్గరకు తీసికెళ్లాడు. రిపేరీ చేస్తుండగా ఇంజిన్ వద్ద నుంచి పాము బయటకు రావడంతో మెకానిక్, బైక్ యజమాని భయానికి గురయ్యారు. ఆకుపచ్చరంగు పామును చూడడానికి జనం గుంపులుగా వచ్చారు. పామును రక్షించే క్రమంలో అది చనిపోయింది.