
చీరాల: సినీనటి హెబ్బా పటేల్ సందడి చేసింది. స్థానిక దర్బార్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బిన్యూ మొబైల్ షాపును శనివారం ఆమె ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన తర్వాత ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా బిన్యూ షోరూం ఎండీ బాలాజీ చౌదరి మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించే దిశగా తాము కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37 షోరూంలను ప్రారంభించామని, చీరాలలో 38వ షోరూంను ప్రారంభించినట్లు తెలిపారు. అలానే బాపట్ల, పొన్నూరు, హిందూపూర్‌లలో కూడా షోరూంలు ప్రారంభిస్తున్నామన్నారు. లక్ష మంది జనాభా ఉన్న ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు షోరూంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రంలో వంద షోరూంలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బిన్యూ షోరూం ప్రారంభించేందుకు ప్రముఖ నటి హెబ్బా పటేల్ చీరాలకు వచ్చిందని తెలుసుకున్న ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు.