Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Leaders Protest AT Visaka Cricket Stadium Updates1
‘వైఎస్సార్‌ పేరు.. చెరిపేస్తే చెరిగిపోయేది కాదు’

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ బ్రాండ్ ఉండకూడదని ప్రయత్నిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌. వైఎస్సార్‌ చరిత్ర.. చెరిపేస్తే చెరిగిపోయేది కాదని చెప్పుకొచ్చారు. విశాఖ స్టేడియానికి వైఎస్సార్‌ పేరును తొలగించడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు. విశాఖ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. దివంగత మహానేత వైఎస్సార్‌ పేరును క్రికెట్‌ స్టేడియానికి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే తొలగించిన పేరు యథావిధిగా పెట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు చేరుకుని కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ..‘వైఎ‍స్సార్‌ చనిపోయిన తర్వాత 2009లో విశాఖలోని స్టేడియానికి ఆయన పేరు పెట్టారు. వైఎస్సార్‌ ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవకు గుర్తుగా తీర్మానం చేసి పేరు పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ బ్రాండ్ ఉండకూడదు అని చూస్తున్నారు. అధికారంలోకి రావడంతో నాగార్జున యూనివర్సిటీలో ఉన్న వైఎస్సార్‌ విగ్రహం తొలగించారు. బాపట్లలో ఆయన విగ్రహాన్ని తగలబెట్టారు. సీత కొండ వ్యూ పాయింట్‌కు పేరు తొలగించారు.ACA స్పందించాలి.. కూటమి ప్రభుత్వం ఉన్మాద చర్యలు మానుకోవాలి. స్టేడియం దగ్గర వైఎస్సార్‌ విగ్రహాన్ని ACA పెట్టింది. 48 గంటలు అవుతున్నా ఈ ఘటనపై ACA నోరు విప్పలేదు. రాజకీయాల్లో ఉన్నవారు క్రికెట్ అసోసియేషన్‌లో ఉండరాదు. దానికి భిన్నంగా కూటమి ఎంపీలు ఉన్నారు. వైఎస్సార్‌ పేరు చెబితే ఎందుకు భయపడుతున్నారు?. విశాఖలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ప్రైవేట్ పరం కాకుండా చేశారు. వైఎస్‌ జగన్ సీఎంగా అండగా జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టారు. నాలుగు సార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఎందుకు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టలేదు?. ఎన్టీఆర్‌కు ఎందుకు భారతరత్నను చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయలేదు?.ఏపీలో వైఎస్సార్‌సీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర ద్వారా వైఎస్ జగన్ లక్షలాది మంది క్రీడాకారులను ప్రోత్సహించారు. వైఎస్సార్‌ చరిత్ర.. చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. ఇప్పటికైనా తొలగించిన వైఎస్సార్‌ పేరును వెంటనే స్టేడియానికి పెట్టాలి. పేరు తొలగించడంపై ACA నోరు విప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. పోలీసుల మోహరింపు.. మరోవైపు.. వైఎస్సార్‌సీపీ నేతల నిరసనల నేపథ్యంలో కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు దిగింది. చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం తెల్లవారుజామునుంచే వైఎస్సార్‌సీపీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. అంతేకాకుండా క్రికెట్‌ స్టేడియం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.ఇదిలా ఉండగా, నగరంలోని పీఎంపాలెం వద్దనున్న డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడి­యంలో మాజీ సీఎం వైఎస్సార్‌ పేరును పాలకవర్గం తొలగించింది. వైఎస్సార్‌ రాష్ట్రానికి అందించిన సేవలకు గుర్తుగా 2009 సెప్టెంబరు 14న అప్పటి ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆధ్వ­ర్యంలో ఏసీఏ–వీడీసీఏ స్టేడియాన్ని వైఎస్సార్‌ ఏసీఏ–­వీడీసీఏ స్టేడియంగా పేరు మార్చారు. అప్పుడు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది.తాజాగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికా­రంలోకి వచ్చాక, ప్రధానంగా విశాఖలో వైఎస్సార్‌ గుర్తులు తుడి­చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా విశాఖ బీచ్‌ తదితరచోట్ల వైఎస్సార్‌ వ్యూ పాయింట్లు ధ్వంసం చేశారు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో పలుచోట్ల ఉన్న వైఎస్సార్‌ పేరును మరమ్మతుల పేరిట తొలగించేస్తున్నారు. ఈ చర్యపట్ల క్రికెట్‌ అభిమానులతోపాటు వైఎస్సార్‌ అభిమానులు మం­డిపడుతున్నారు. ప్రభుత్వం మార్కు తన పాలనలో చూపించాలిగానీ ఇలాంటి విధ్వంసకర విషయాల్లో కాదని ఆక్షేపిస్తున్నా­రు.

Betting Apps Case: Police Files Case On Vijay Devarakonda, Rana, Manchu Lakshmi2
బెట్టింగ్‌ యాప్స్‌ కేసు: విజయ్‌ దేవరకొండ, రానా, మంచు లక్ష్మిపై కేసు!

సోషల్‌ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులపై హైదరాబాద్‌ పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్‌ (Betting Apps Case)తో ప్రజలను బెట్టింగ్ ఊబిలో దించుతున్నవారిపై చర్యలు తీసుకోవాలంటూ వినయ్ అనే వ్యక్తి మార్చి 17న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని అధారంగా ఇప్పటికే కొంతమంది యూట్యూబర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. (చదవండి: పంజాగుట్ట పీఎస్‌కు విష్ణుప్రియ!)తాజాగా టాలీవుడ్‌కి చెందిన అగ్రహీరోలు, నటులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), రానా దగ్గుబాటితో పాటు మంచు లక్ష్మి (Lakshmi Manchu), నిధి అగర్వాల్‌పై కూడా కేసు నమోదు చేశారు. అలాగే నటుడు ప్రకాశ్‌ రాజ్‌, హీరోయిన్లు ప్రణీత, అనన్య నాగళ్ల, బుల్లితెర నటులు సిరి హనుమంతు ,,శ్రీముఖి,, వంశీ సౌందర్య రాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి ,నాయిని పావని, నేహా పతాన్ ,పాండు, పద్మావతి ,ఇమ్రాన్ ఖాన్‌తో సహా మొత్తం 25 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా నటి విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కి వెళ్లింది. తన అడ్వకేట్‌తో కలిసి వెళ్లిన విష్ణుప్రియను పోలీసులు తమదైన శైలీలో విచారణ చేస్తున్నారు.

Indian Govt Serious Concern On Elon Musk AI bot Grok3
మస్క్‌ గ్రోక్‌పై భారత ప్రభుత్వం ‌సీరియస్!‌

న్యూఢిల్లీ: ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే.. ప్రతిచర్య తీవ్రంగానే ఉంటుంది. మనిషికే కాదు.. మనిషి తెచ్చిన సాంకేతికతకూ అందుకు మినహాయింపు లేకుండా పోయింది. తాజాగా.. ఇలాన్‌ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బో‌ట్‌ గ్రోక్‌(Grok) వ్యవహారం ఇప్పుడు ఇలాగే మారింది. ఎక్స్‌ నుంచి సోషల్‌ మీడియాలో అటు ఇటు తిగిరి.. చివరకు ప్రభుత్వం దృష్టికి చేరింది. అన్‌ఫిల్టర్‌ భాష.. సెన్సార్‌లేని పదజాలంతో గ్రోక్‌ యూజర్లకు సమాచారం అందిస్తుండడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో స్క్రూటినీ(పరిశీలన)కి దిగింది. రెచ్చగొట్టే తరహా సమాచారాన్ని గ్రోక్‌ యూజర్లకు ఎందుకు అందిస్తోందంటూ ఎక్స్‌ను తాజాగా కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆరా తీసింది. మరీ ముఖ్యంగా హిందీ భాషను అలా దుర్వినియోగపర్చడంపై ఆరా తీసింది. అయితే.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, తమ వివరణకు కొంత సమయం ఇవ్వాలని అవతలి నుంచి సమాధానం వచ్చినట్లు సమాచారం. ఆ వివరణ ఆధారంగా.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించి సరిపెట్టడమా? లేదంటే చర్యలు తీసుకోవడమా? ఉంటుందని మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇలాన్‌ మస్క్‌(Elon Musk)కు చెందిన ఏఐ స్టార్టప్‌ ఎక్స్‌ఏఐ గ్రోక్‌ చాట్‌బాట్‌ సేవల్ని అందిస్తోంది. అయితే భారతీయ కొందరు యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్‌ హిందీ యాసలో సమాధానాలు ఇస్తోంది. అలాగే కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుండడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. చాట్‌జీపీటీ సహా చాలావరకు ఏఐ చాట్‌బాట్‌లు వివాదాస్పద అంశాల జోలికి పోవడం లేదు. అలాగే.. భాష విషయంలోనూ సెన్సార్డ్‌గా ఉంటున్నాయి. కానీ, గ్రోక్‌ అందుకు విరుద్ధంగా ఉండడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఏఐ రీసెర్చర్‌ రిలే గూడ్‌సైడ్‌(Riley Goodside)కు గ్రోక్‌తో ఎదురైన చేదు అనుభవం ఆ మధ్య వైరల్‌ అయ్యింది. పదే పదే ఆయన గ్రోక్‌ను వాయిస్‌ మోడ్‌లో ప్రశ్నలతో విసిగించారు. దీంతో అది ఓపిక నశించి.. మనిషి తరహాలోనే అరుస్తూ ఆయన్ని బూతులు తిట్టి.. ఆ సంభాషణను అక్కడితోనే ముగించింది. Grok 3 Voice Mode, following repeated, interrupting requests to yell louder, lets out an inhuman 30-second scream, insults me, and hangs up pic.twitter.com/5GtdDtpKce— Riley Goodside (@goodside) February 24, 2025

BCCI's Cash Reward For Team India 3 Times Of Official CT Prize Money4
CT 2025: టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

టీమిండియాపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) కాసుల వర్షం కురిపించింది. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో విజేతగా నిలిచినందుకు భారీ క్యాష్‌ రివార్డు ప్రకటించింది. ఈ మెగా వన్డే టోర్నీలో ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా చాంపియన్‌గా నిలిచిన రోహిత్‌ సేనకు రూ. 58 కోట్ల నజరానా ఇచ్చింది. రోహిత్‌ సేన జైత్రయాత్రను ప్రస్తావిస్తూఈ మొత్తాన్ని ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది.. అదే విధంగా అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ సభ్యులకు బీసీసీఐ పంచనుంది. ఇందుకు సంబంధించి బోర్డు గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు.. ‘‘ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియాకు రూ. 58 కోట్ల క్యాష్‌ రివార్డు ప్రకటిస్తున్నాం.మెన్స్‌ సెలక్షన్‌ కమిటీ సభ్యులతో పాటు ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది పనితీరును గుర్తిస్తూ వారిని ఇలా సత్కరిస్తున్నాం’’ అని పేర్కొంది. అదే విధంగా.. ‘‘కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలో టీమిండియా టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబరిచింది. ఓటమన్నదే ఎరుగక నాలుగు విజయాలతో ఫైనల్‌ చేరింది.తొలుత బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత పాకిస్తాన్‌పై కూడా ఆరు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. అదే జోరును కొనసాగిస్తూ న్యూజిలాండ్‌పై 44 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్‌ టాపర్‌ అయ్యింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌ చేరుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించింది’’ అని బీసీసీఐ తమ ప్రకటనలో రోహిత్‌ సేన జైత్రయాత్రను ప్రస్తావించింది.అందుకే ఈ నగదు బహుమతిఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ మాట్లాడుతూ.. ‘‘వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సాధించడం ఎంతో ప్రత్యేకమైనది. భారత జట్టు అంకిత భావం, ప్రపంచ వేదికపై దేశానికి వారు తెచ్చి పెట్టిన కీర్తి ప్రతిష్టలకు గుర్తింపుగా నగదు బహుమతి అందజేస్తున్నాం.ఈ గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరి సేవలను మేము గుర్తించాం. భారత్‌కు ఈ ఏడాది ఇది రెండో ఐసీసీ ట్రోఫీ. అండర్‌-19 వుమెన్స్‌ వరల్డ్‌కప్‌లో మనం చాంపియన్లుగా నిలిచాం. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని కూడా సొంతం చేసుకున్నాం.దేశంలో క్రికెటింగ్‌ ఎకోసిస్టమ్‌ ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌-2024 సాధించిన రోహిత్‌ సేన.. ఆ టోర్నీలోనూ అన్ని మ్యాచ్‌లలో అజేయంగా నిలిచింది. నాడు బీసీసీఐ రోహిత్‌ సేనకు ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది.ఎనిమిది జట్ల మధ్య పోటీతాజాగా చాంపియన్స్‌ ట్రోఫీలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయగా.. ఈసారి రూ. 58 కోట్ల బహుమతి ఇచ్చింది. ఇది ఐసీసీ ఇచ్చిన ప్రైజ్‌ మనీ (భారత కరెన్సీలో దాదాపు రూ. రూ.19.5 కోట్లు) కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఇక ఈ మెగా ఈవెంట్‌కు పాకిస్తాన్‌ ఆతిథ్యం ఇవ్వగా.. భారత జట్టు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లోనే తమ మ్యాచ్‌లన్నీ ఆడింది. ఈ టోర్నీలో భారత్‌తో పాటు గ్రూప్‌-ఎ నుంచి పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌.. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌ పోటీపడ్డాయి.తొలి సెమీస్‌లో భారత్‌ ఆస్ట్రేలియాను ఓడించగా.. రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్‌ చిత్తు చేసింది. ఈ క్రమంలో టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య మార్చి 9న జరిగిన టైటిల్‌ పోరులో రోహిత్‌ సేన నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత అర్ధ శతకం(76) బాదిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.చదవండి: ‘రేపు మీ బౌలింగ్‌ను చితక్కొడతాను చూడు!.. అన్నంత పని చేశాడు’

Saurabh Rajput Daughter Says Papa Drum Mein Hain5
‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’.. చిన్నారి వ్యాఖ్యలపై నాన్నమ్మ ఆవేదన

మీరట్‌: ప్రియుడి మోజులో పడి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ వెలుగుచూసింది. భర్త హత్య అనంతరం.. ప్రియుడితో కలిసి ఆమె విహారయాత్రకు వెళ్లింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ కేసులో మృతుడి కూతురు చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ హత్యను ఆమె చూసి ఉండవచ్చని తెలుస్తోంది.మీరట్‌కు చెందిన మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ హత్యకు సంబంధించి తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్యను మృతుడి ఆరేళ్ల కుమార్తె చూసి ఉంటుందని సమాచారం. తన తండ్రి డ్రమ్ములో ఉన్నాడని ఆ పాప చుట్టుపక్కల వారికి చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు మృతుడి తల్లి ఈ విషయాలను వెల్లడించారు. ‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’ అని ఆ చిన్నారి పొరుగింటి వారికి పదే పదే చెప్పడం గమనించిన ముస్కాన్‌ బాలికను వేరే చోటుకు పంపించేసింది’ అని సౌరభ్‌ తల్లి రేణు దేవీ ఆవేదన వ్యక్తంచేశారు.సౌరభ్‌ తల్లి రేణు దేవీ మీడియాతో మాట్లాడుతూ.. నా కుమారుడు సౌరభ్‌ను అతడి భార్య ముస్కాన్‌, ఆమె ప్రియుడు కలిసి హత్య చేశారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ట్రిప్‌కు వెళ్లారు. తిరిగొచ్చిన తర్వాత మరమ్మతుల కోసం వారు ఉంటున్న ఇంటి యజమాని కూలీలను తీసుకొచ్చారు. ఇంట్లో ఉన్న డ్రమ్మును వారు పైకి ఎత్తలేకపోయారు. దీంతో, లోపల ఏముందని అడిగితే చెత్తాచెదారం అని ముస్కాన్‌ చెప్పిందట. అనుమానం వచ్చి మూత తీయగా లోపల నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.#WATCH | Meerut, UP | Saurabh Rajput Murder case | Mother of deceased Saurabh Rajput says, "They (Muskan and her partner Sahil) murdered my son, and after that she went for a trip...She locked the body in the room...the owner of the house had asked them (Saurabh and Muskan) to… https://t.co/QyeUSKIwcu pic.twitter.com/hgs3tLfMsk— ANI (@ANI) March 19, 2025అయితే, పోలీసులు వచ్చేలోపే మా కోడలు అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్లిపోయింది. మా ఆరేళ్ల మనవరాలికి కూడా హత్య విషయం తెలిసే ఉంటుంది. చిన్న పాప పదే పదే.. ‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’ పొరుగింటి వారికి చెప్పింది. అది గమనించిన ముస్కాన్‌.. పాపను వేరే చోటకు పంపించేసింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు.డ్రమ్ములో మృతదేహం..సౌరభ్‌ రాజ్‌పుత్‌(29), ముస్కాన్‌(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సౌరభ్‌ మర్చంట్‌ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ముస్కాన్‌కు సాహిల్‌(25)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. సౌరభ్‌ ఉద్యోగం మానేసి లండన్‌కు వెళ్లి ఓ బేకరీలో పనిచేసేవాడు. గత నెల కుమార్తె పుట్టిన రోజు కోసం అతడు ఇండియాకు వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్‌.. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికారు. శరీర భాగాలను ఓ ప్లాస్టిక్‌ డ్రమ్ములో దాచిపెట్టి పైన సిమెంటుతో కప్పిపెట్టారు.మా కుమార్తెను ఉరితీయండి..!నిందితులు ముస్కాన్, సాహిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా చేసిన దారుణాన్ని వారు అంగీకరించారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. కాగా, భర్తను హత్య చేసిన తమ కుమార్తెకు ఉరిశిక్ష విధించాలని ముస్కాన్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కోటీశ్వరుడైన సౌరభ్ తమ కుమార్తెను ఎంతగానో ప్రేమించాడని, అతడిని తల్లిదండ్రులకు దూరం చేసిన ముస్కాన్‌ను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు.

KSR Comment On Pawan Kalyan Pithapuram Speech6
అపరిచితుడికి నెక్ట్స్‌ లెవల్‌లో జనసేనాని!

రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే సభలు సాధారణంగా తాము సాధించిన విజయాల గురించి లేదా.. చేయబోయే పనుల గురించి కార్యకర్తలకు, అభిమానులకూ వివరించే వేదికలుగా ఉపయోగించుకోవడం కద్దు. అయితే ఇటీవలే పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భవ సభలో పవన్‌ కళ్యాణ్‌ తన ప్రసంగం ద్వారా ఏం చెప్పదలచుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. పవన్‌.. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి చెప్పిందేమిటి? పది నెలలుగా అధికారంలో ఉన్న తరువాత ఇప్పుడు చేస్తున్నదేమిటి? ఒకరకంగా చూస్తే పవన్‌ మాట మార్చడంలో రికార్డు సృష్టిస్తున్నారనే చెప్పొచ్చు. జనసేన వార్షికోత్సవ సభలో పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) బోలెడన్ని అబద్ధాలు చెప్పుకొచ్చారు. స్వోత్కర్ష, ఇతరులు పొగడం బాగానే ఉన్నా.. తన సినిమా గబ్బర్‌సింగ్‌లోని డైలాగ్‌ మాదిరి ఎవరి డబ్బు వారే కొట్టుకున్నట్లుగా ఈ సభ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ను దూషించడం కోసం కూడా ఈ సభను ఏర్పాటు చేసుకున్నారు. అన్నిటిలోకి కీలకమైన పాయింట్ ఒకటి మాత్రం ఉంది. నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని తానే నిలబెట్టానని పవన్ ప్రకటించడం. ఇందులో కొంత వాస్తవం, మరికొంత అవాస్తవం ఉంది. పవన్ కళ్యాణ్‌ను మేనేజ్ చేసి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోగలిగింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ సపోర్టు పొందగలిగింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో(Pithapuram Public meeting) చేసిన వ్యాఖ్య టీడీపీ శ్రేణులలో మంట పుట్టించింది. కొందరు టీడీపీ, అభిమానులు పవన్‌ను ఎద్దేవా చేస్తూ, దూషిస్తూ కామెంట్లు కూడా పెట్టారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకంగా.. ‘‘క్వింటాల్ వడ్లు తూగడానికి ఒక్కోసారి కొన్ని వడ్లు అవసరం అవుతాయి. కాని ఆ కొన్ని వడ్లవల్లనే మొత్తం కాటా తూగింది అనుకుంటే ఎలా.. సేనాధిపతి?’’ అని ఎద్దేవా చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ లేదా ఆయన సోదరుడు నాగబాబు సమాధానం చెబుతారా? 👉.. అదే సమయంలో టీడీపీ(TDP) లేకుండా అసలు పవన్‌కు గెలిచే పరిస్థితి లేదని టీడీపీ శ్రేణులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాయి. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ విజయం సాధించారంటే అది టీడీపీ పుణ్యమే అనే సంగతి గుర్తుంచుకోవాలని వారు చెబుతున్నారు. పవన్ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవారే కాదని జనసేన వారి వాదన. ఈ రకంగా ఒకరినొకరు దుయ్యబట్టుకుంటున్నా, ఇద్దరూ కలిసి సాగడానికి పెద్ద ఇబ్బంది పడడం లేదు. పవన్ కేవలం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కే కాకుండా ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌కు కూడా విధేయత కనబరుస్తున్నట్లు అనిపిస్తుంది. రెండు వైపులా ఆత్మాభిమానం అన్నది పెద్ద సమస్య కాకపోవడం కూడా వీరికి కలసి వచ్చే పాయింట్. 👉పవన్ కళ్యాణ్ ఈ సభలో సూపర్ సిక్స్ గురించి కాని, ఎన్నికల ప్రణాళికలోని అంశాల గురించి కాని ప్రస్తావించకుండా తన గొప్ప గురించి, తన కుటుంబం గొప్ప గురించి చెబితే ఆయన అభిమానులు అమాయకంగా చప్పట్లు కొట్టవచ్చు. ప్రజలకు ఒరిగేదీ ఉండదు. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఎక్కాలు చదివి మరీ ప్రచారం చేశారే! వలంటీర్ల కడుపు కొట్టనంటూ, రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని కథలు చెప్పారే. నిరుద్యోగ భృతి రూ.మూడు వేలు ఇస్తామని, ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని అన్నారే. పవన్ కళ్యాణ్ అయితే ప్రతి నియోజకవర్గంలో 500 మందికి రూ.పది లక్షల చొప్పున ఇచ్చి వారందరిని అభివృద్ది చేసేస్తామని గప్పాలు కొట్టారే. వీటి గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా తాను గెలవడమే గొప్ప అనుకోండని అంటున్నారు. జనసేనకు సిద్దాంత బలం ఉందని చెబుతుంటే నవ్వు వస్తుంది. ఏ సిద్దాంతం ఉందో ఎవరికి అర్థం కాదు. చెగువేరా నుంచి సనాతని వరకు రకరకాల వేషాలు మార్చి నట జీవితంలోనే కాదు.. రాజకీయ జీవితంలో కూడా బహురూపి అన్న విధంగా వ్యవహరించిన పవన్ సిద్దాంతం ఎలాగైనా అధికారంలోకి రావడమే అన్నది అర్థమవుతూనే ఉంది. పిఠాపురంలో వర్మే తనను గెలిపించాలని చేతులు పట్టుకుని అర్థించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వర్మను ఎంతలా అవమానిస్తున్నారు? నాగబాబు సభలో అంతగా వర్మను అవమానించవలసిన అవసరం ఉందా? దానిని పవన్ కూడా సమర్థిస్తున్నట్లే కదా! ఈ ఒక్కటి చాలదా! పవన్ నైజం ఏమిటో తెలుసుకోవడానికి. సనాతన ధర్మం తన రక్తంలోనే ఉందని చెప్పి ప్రజలను మాయ చేసే యత్నం చేస్తున్నారు. అంత సనాతని అయితే తన ఇంటిలోనే అన్య మతాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారన్నది హిందూ ధర్మవాదుల ప్రశ్న. ఒకసారి కులం లేదు.. మతం లేదు.. అంటూ గంభీర ప్రసంగాలు చేసి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి సనాతని అంటూ కల్లబొల్లి కబుర్లు చెబితే జనం నమ్మాలన్నమాట. నిజంగానే ధర్మం, సత్యం ఆచరించేవారైతే ఇప్పుడు కూడా నిత్యం అసత్యాలే చెబుతున్నారే? అదేనా ధర్మం చెప్పేది. తిరుమల లడ్డూ పట్ల అపచారం చేసిన పవన్ దానిని బుకాయించి నిందితులు అరెస్టు అయ్యారని అంటున్నారే. పవన్ ఆనాడు చెప్పిందేమిటి? తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన పిచ్చి ఆరోపణను భుజాన వేసుకుని హడావుడి చేశారే. దానికి తోడు అయోధ్యకు కల్తీ నెయ్యి వాడిన లడ్డూలు పంపారని నింద మోపారే! లడ్డూలలో కల్తీ నెయ్యి వాడినట్లు ఎక్కడా ఆధారాలు దొరకలేదే! కల్తీ నెయ్యి ఉండడం వేరు. కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేయడం వేరు. తగు ప్రమాణాలు లేని నెయ్యిని టీటీడీ వెనక్కి పంపించింది కదా! అయినా పవన్ అబద్దం ఆడుతున్నారంటే ఆయనకు సనాతన ధర్మం మీద ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. 👉రాజకీయం కోసం ఏ వేషం అయినా కట్టవచ్చన్నది ఆయన నమ్మిన ధర్మం అన్న భావన కలగదా! దీపారాధన చేసే దీపంతో తన తండ్రి సిగెరెట్ వెలిగించుకునేవారని గతంలో చెప్పి.. ఇప్పుడు తమ ఇంటిలో అంతా రామ జపమే చేస్తారని చెబితే వినేవాళ్లను వెర్రివాళ్లను చేయడం కాదా! అసలు ఆయన తండ్రి గురించి ఎవరు అడిగారు. ఆ విషయాలతో జనానికి ఏమి సంబంధం. ఇన్నేళ్ల రాజకీయంలో తాను ఎక్కడ పుట్టింది, ఎక్కడ చదవింది అన్న విషయంలో ఎన్ని రకాలుగా మాట్లాడారో వీడియో సహితంగా కనిపిస్తుంటాయి. 👉వైఎస్‌ జగన్(YS Jagan) పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పనులు చేసింది, ఎవరెవరిని ఎలా ఇబ్బంది పెట్టింది ఆయన మనసుకు తెలియదా! గతంలో ఉత్తరాది, దక్షిణాది అంటూ గొంతు చించుకుని అరచి మరీ మాట్లాడిన పవన్ కు సడన్ గా జ్ఞానోదయం అయిందని అనుకోవాలా? హిందీ గురించి కూడా మాట్లాడారు. దానికి ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బదులు ఇస్తూ ‘‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి’’, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please అని కామెంట్ చేశారు. ఏపీలో ఆంగ్ల మీడియం ను వ్యతిరేకించే పవన్ కళ్యాణ్ బీజేపీ వారి మెప్పుకోసం హిందీ గాత్రం అందుకున్నారు. సమాజంపై అవగాహన లేకుండానే పార్టీ పెట్టేస్తామా అని ఆయన ప్రశ్నించారు. నిజమే.. అసలు సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా, సినీ నటుడుగా ప్రజలను ఆకర్షించి, ఈ పదేళ్లలో అనేక మార్లు మాట మార్చి, రంగులు మార్చి ఎలాగైతే ఉప ముఖ్యమంత్రి కాగలిగిన పవన్ కళ్యాణ్ నిలిచి గెలిచారన్నంత వరకు ఓకే గాని, మిగిలినవాటిలో అసత్యాలు, అసంబద్ధ విషయాలే ఉన్నాయని చెప్పాలి. ప్రజలను ఏమార్చడం వరకు సఫలం అయ్యారని ఒప్పుకోవచ్చు. దానికి ఆయన సోదరుడు ,మెగాస్టార్ చిరంజీవి మనసు ఉప్పొంగిపోవచ్చు. చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన బాసలు మర్చిపోవడమే కాకుండా నిత్యం కలుషిత రాజకీయాలు చేస్తున్న తీరు మాత్రం మాత్రం ప్రజల మనసులను కకావికలం చేస్తుంది. కొసమెరుపు ఏమిటంటే.. ఏ దేశమేగినా..అన్న గేయం రాసింది గురజాడ అప్పారావు అని చెప్పడం. అది రాసింది రాయప్రోలు సుబ్బారావు అన్న సంగతి వేల పుస్తకాలు చదివిన విజ్ఞాని పవన్‌కు తెలియదా? లేక ఆయన ఉపన్యాసం రాసిన వ్యక్తికి తెలియదా! శ్రీ శ్రీ నవ సమాజం కోసం రాసిన గేయాన్ని సనాతన ధర్మానికి వాడుకోవడం కూడా హైలైటే!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Who is Badar Khan Suri  Indian Researcher In US Faces Deportation7
హమాస్‌తో లింకులు? భారతీయ రీసెర్చర్‌ అరెస్ట్‌

అగ్రరాజ్యంలో మరో భారతీయ వ్యక్తిపై బహిష్కరణ వేటు పడింది. హమాస్‌ సంస్థతో లింకులు ఉన్నాయన్న అభియోగాలతో బాదర్‌ ఖాన్‌ సూరి అనే రీసెర్చర్‌ను అక్కడి భద్రతా అధికారులు అరెస్ట్‌ చేశారు. త్వరలో ఆయన్ని భారత్‌కు తిరిగి పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే ఈ చర్యలను సవాల్‌ చేస్తూ ఆయన కోర్టుకు ఎక్కారు.బాదర్‌ ఖాన్‌ సూరి(Badar Khan Suri).. వాషింగ్టన్‌ జార్జిటౌన్‌ యూనివర్సిటీలో రీసెర్చర్‌గా ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వర్జినీయాలోని ఆయన నివాసం వద్ద ఫెడరల్‌ ఏజెంట్లు ఆయన్ని అరెస్ట్‌ చేశారు. ఆయన వీసా కూడా రద్దు చేసినట్లు యూఎస్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ(DHS)‌ తెలిపింది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌తో సంబంధాలు ఉండడం, సోషల్ మీడియాలో యూదు వ్యతిరేకతను ప్రచారం చేయడం లాంటి నేరాలకు పాల్పడినందుకుబాదర్‌ ఖాన్‌ సూరిని అదుపులోకి తీసుకున్నట్లు, ఆయన్ని భారత్‌కు పంపించే ప్రయత్నాల్లో ఉన్నట్లు డీహెచ్‌ఎస్‌ స్పష్టం చేసింది.మరోవైపు తన అరెస్ట్‌, తరలింపు ప్రయత్నాలను ఇమ్మిగ్రేషన్‌ కోర్టులో సూరి సవాల్‌ చేశారు. తన భార్య పాలస్తీనా మూలాలు ఉండడంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని, తనకు ఎలాంటి నేర చరిత లేదని తన పిటిషన్‌లో సూరి పేర్కొన్నారు.బాదర్‌ నేపథ్యం ఇదే..భారత్‌కు చెందిన బాదర్‌ ఖాన్‌ సూరి.. స్వస్థలం ఎక్కడ అనేదానిపై స్పష్టత లేదు. అయితే ఆయన విద్యాభ్యాసం అంతా భారత్‌లోనే గడిచినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో పీస్‌ అండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ స్డడీస్‌పైన పీహెచ్‌డీ చేసిన ఆయన.. ఆపై ఇరాక్‌, అఫ్గనిస్థాన్‌లో శాంతిస్థాపనకు సంబంధించిన అంశాలపై పరిశోధనలూ చేశారు. అమెరికాకు వలస వెళ్లిన బాదర్‌.. మఫెజ్‌ అహమద్‌ యూసఫ్‌ సలేహ్‌ అనే పాలస్తీనా మూలాల ఉన్న అమెరికన్‌ పౌరురాలిని వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి హమాస్‌లో కీలక నేత అయిన అహ్మద్‌ యూసెఫ్‌గా డీహెచ్‌ఎస్‌ ప్రకటించింది. బాదర్‌ ఖాన్‌ సూరి అరెస్ట్‌ కావడంతో.. జాతీయ భద్రతా, వ్యక్తిగత హక్కులు, విద్యాలయాలపై రాజకీయాల ప్రభావం.. లాంటి అంశాలు చర్చకు వచ్చాయి. Georgetown University researcher detained by ICE, accused of ‘actively spreading Hamas propaganda and promoting antisemitism’: report https://t.co/HBqSGzG6PR pic.twitter.com/wkXWKSYRSh— New York Post (@nypost) March 20, 2025అమెరికా ఫారిన్‌ పాలసీ ప్రకారం.. ఆ దేశానికి ముప్పుగా పరిగణించే నాన్ సిటిజన్స్‌‌ను అక్కడి నుంచి తరలించే ఇమ్మిగ్రేషన్‌ చట్టాన్ని సూరిపై ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇదే చట్టాన్ని ఉపయోగించి కిందటి ఏడాది కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి, గ్రీన్‌కార్డ్‌ హోల్డర్‌ అయిన మహమ్మూద్‌ ఖలీల్‌ను అక్కడి నుంచి సొంత దేశానికి తరలించారు.రంజనీ స్వీయ బహిష్కరణఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధంలో.. పాలస్తీనాకు మద్దతుగా కొలంబియా యూనివర్శిటీ విద్యార్థులు ఇటీవల అమెరికాలో పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. ఈ నిరసనల్లో పాల్గొన్న భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్‌(Ranjani Srinivasan)ను రద్దు చేసిన డీహెచ్‌ఎస్‌.. స్వీయ బహిష్కరణకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం డీహెచ్‌ఎస్‌ రిలీజ్‌ చేసింది.ప్రత్యేక యాప్‌తో.. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనేవాళ్లను స్వీయ బహిష్కరణ పేరిట అక్కడి నుంచి పంపించేందుకు డీహెచ్‌ఎస్‌ సీబీపీ హోమ్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ఉపయోగించే రంజనీ శ్రీనివాసన్‌ను పంపించేశారు. ‘‘అమెరికాలో నివసించడానికి, చదువుకోవడానికి వీసా మంజూరుచేస్తాం. కానీ, మీరు ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా నిరసనలు తెలిపినప్పుడు వాటిని రద్దు చేస్తాం. అలాంటివారు ఈ దేశంలో ఉండకూడదు. మిలిటెంట్‌ సంస్థలకు మద్దతుగా నిరసనలు తెలిపిన కొలంబియా యూనివర్శిటీ విద్యార్థిని ఒకరు స్వీయ బహిష్కరణ కోసం సీబీపీ హోమ్‌ ఆప్‌ ఉపయోగించిందనందుకు సంతోషిస్తున్నా’’ అని డీహెచ్‌ఎస్‌ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ప్రకటించారు.

CEO Rejects Female Candidate Who Asked Him To Meet Her Husband8
భర్త ఆమోదం కావాలంది.. ఉద్యోగం పోగొట్టుకుంది

సాధారణంగా ఉద్యోగం వచ్చిన వెంటనే చాలామంది జాయిన్ అయిపోతారు. కొందరు అమ్మానాన్నలను అడగాలని, పెళ్ళైన మహిళలైతే తమ భర్తలకు చెప్పాలని అనుకుంటారు. ఇటీవల ఓ మహిళ ఉద్యోగానికి ఎంపికైన తరువాత.. తన భర్త ఆమోదం కావాలని అడిగిన వెంటనే జాబ్ పోగొట్టుకుంది.ముంబైకి చెందిన ఒక సీఈఓ తన కంపెనీలో సీనియర్ పదవికి ఎంపికైన ఒక మహిళను ఉద్యోగంలో చేరడానికి ముంచే తొలగించారు. ఎందుకంటే ఆ మహిళ జాబ్ ఆఫర్‌ను అంగీకరించే ముందు తన భర్త ఆమోదం పొందాలని అడిగింది. దీంతో తక్షణమే ఆమెను ఆ ఉద్యోగానికి రిజెక్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.Spoke to a candidate tdy, who wanted us to meet her husband after we had selected her.Instant reject.P.s: This was for a senior level hire.— Vinod Chendhil (@vinodchendhil) March 18, 2025కంపెనీలో సీనియర్ స్థాయి ఉద్యోగానికి ఎంపికైన మహిళ.. ఉద్యోగంలో చేరడానికే సొంత నిర్ణయం తీసుకోవడం లేదు. దీనికే తన భర్త ఆమోదం కావాలని చెబుతోంది. రేపు కంపెనీ కోసం పెద్ద నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతుంది. ఆమె పూర్తిగా తన భర్త మీదనే ఆధారపడి ఉందని.. కంపెనీ సీఈఓ భావించి రిజెక్ట్ చేశారు.ఇదీ చదవండి: 'పెట్రోల్ కార్ల ధరలకే ఎలక్ట్రిక్ కార్లు'.. నితిన్ గడ్కరీప్రస్తుతం కంపెనీ సీఈఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపైన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొందరు సీఈఓ చేసిన పనిని సమర్దిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. ఇంకొందరు మహిళలు తరచుగా ఎదుర్కొనే సామాజిక అడ్డంకులను ఎత్తి చూపారు.Bcas she wants her husband to say yes for her to join us. Why would an independent woman want that. Basically she wants her husband to interview us to see if its ok for her to join. Shows she is totally dependent on him. How will she ever take any decisions, if she cannot take a…— Vinod Chendhil (@vinodchendhil) March 18, 2025

Olive Hospital Unveils 5th Edition of Wholesome Recipes for A Vibrant Life9
పోషకాహార ప్రాధాన్యత : రెసిపీ & డైట్ గైడ్‌ ఆవిష్కారం

తెలంగాణలోని ప్రముఖ ఆలివ్ హాస్పిటల్ (Olive Hospital) కొత్త ఆరోగ్యకరమైన వంటకాలతో మరో పుస్తకాన్ని విడుదల చేసింది. ప్రసిద్ధ వంటకాలతో , "హోల్సమ్ రెసిపీస్ ఫర్ ఎ వైబ్రెంట్ లైఫ్" (Wholesome Recipes for a Vibrant Life) ఐదో ఎడిషన్‌ను ప్రారంభించింది. ఆసుపత్రి నిపుణులైన డైటీషియన్లు ఈ పుస్తకం,రుచిలో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించేలా ఈ రెసిపీలను రూపొందించారు.2025 ఎడిషన్‌లో భారతదేశపు గొప్ప పాక సంప్రదాయాలను సమతుల్య పోషకాహారంతో మిళితం చేసే 60 కి పైగా వంటకాలు ఉన్నాయి. ఇందులో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు,రోగనిరోధక శక్తిని పెంచే సుగంధ ద్రవ్యాలు వంటి వివిధ పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, కాశ్మీరీ పులావ్ బిసి బెలె బాత్, పనీర్ టిక్కా బిర్యానీ, స్పినాచ్ పులావ్ ఉన్నాయి.ఇవన్నీ ఇంట్లో సులభంగా తయారు చేయడంతోపాటు, ఇవి అవసరమైన పోషకాలను అందిస్తాయని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఆరోగ్య సంరక్షణలో విశ్వసనీయత, నాణ్యమన వైద్య విధానాలతో మెరుగన ఆరోగ్య సేవలను అందిసున్న ఆలివ్ హాస్పిటట్‌ పోషకాహారం పాధాన్యతను వివరిస్తూ దీన్ని విడుదల చేసింది.మెరుగైన ఆరోగ్యం వైపు ఒక అడుగుఆలివ్ హాస్పిటల్ గత నాలుగేళ్లుగా తీసుకొస్తున్న డైట్ ప్లాన్ పుస్తకం ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు, రోగులకు ఉపయోగ పడుతోంది. ఆసుపత్రి వారి శ్రేయస్సు పట్ల నిరంతర నిబద్ధతలో భాగంగా ఇది రోగులకు పంపిణీ చేస్తారు. ప్రోటీన్-రిచ్ వంటకాల్లో పనీర్ టిక్కా బిర్యానీ, మాటర్ పులావ్ ఫీచర్లు, ప్రోటీన్ సుసంపన్నం కోసం పనీర్, టోఫు, కాయధాన్యాలు, బీన్స్, పాల ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఆకుకూరలతో సమృద్ధిగా ఉండే పాలకూర పులావ్, కాలీఫ్లవర్ లెమన్‌ రైస్‌, ఫైబర్-ప్యాక్డ్ రెసిపీలుంటాయి. ఇందులోని వంటకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియకు సహాయపడటానికి మరియు శక్తి స్థాయిలను నిలబెట్టడానికి పదార్థాల సమతుల్య మిశ్రమాన్ని అందిస్తుందని డైటెటిక్స్ హెడ్ సుగ్రా ఫాతిమా చెప్పారు.

Financial Twist In Chandrababu And Bill Gates Meeting10
గూగుల్, గేట్స్ ముసుగులో నడుస్తున్నదంతా మాయేనా?

‘గోరంతను కొండంతలుగా చేసి చెప్పడం’ అని తెలుగులో ఒక సామెత ఉంటుంది. ఫరెగ్జాంపుల్ ‘ఒక పని’ చేయడం వల్ల వాస్తవంగా దక్కే ప్రయోజనం పది రూపాయలు ఉన్నదనుకోండి.. అక్కడ ఓ వెయ్యిరూపాయల లాభం రాబోతున్నట్టుగా పదేపదే టముకు వేయడం, ప్రచారం చేసుకోవడం లాంటిదన్నమాట. వాస్తవం ఏంటంటే.. ఆ పని ఇంకా మొదలు కాదు కూడా! కానీ, ఆ పని చేయగానే వెయ్యి రూపాయలు లాభం తనకు రాబోతున్నట్టుగా.. ఒక వ్యక్తి బీభత్సంగా ప్రచారం చేసుకుని.. లాభాలను ప్రొజెక్టు చేసి, ఓ అయిదువందల రూపాయల అప్పులు పుట్టించాడనుకోండి. ఆ అయిదువందల రూపాయలతో చిన్న వ్యాపారం చేసి ఓ రెండొందల లాభాలు ఆర్జించాడనుకోండి. అతనివద్ద నికరంగా రెండొందల రూపాయలైతే ఉంటాయి. కానీ, దీనంతటికీ మూలం అయిన ‘ఒక పని’ అనేది జరిగిందో లేదో, అన్నట్టుగా వెయ్యిరూపాయల లాభం వచ్చిందో లేదో ఎవ్వరికీ తెలియదు. ఇలాంటి మేధావిని, ఈ టెక్నిక్కులను ఏమనాలి? వీటినే గజకర్ణ, గోకర్ణ టక్కుటమార విద్యలు అని అంటారు. కేవలం మార్కెటింగ్ మాయాజాలంతో బాహ్య ప్రపంచాన్నంతా ఒక మాయలో ఉంచి.. నడిపించే దందా అన్నమాట. వాస్తవాలు వేరే ఉంటాయి.. వాటి ద్వారా పొందే ప్రయోజనాలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో అనుసరిస్తున్న వైఖరి.. ఈ గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలనే తలపిస్తోంది. కాస్త లోతుగా గమనించండి. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు వస్తోన్నదంటే.. వారు పెట్టే పెట్టుబడుల గురించి, కల్పించబోయే ఉద్యోగావకాశాల గురించి గోరంతలను కొండంతలుగా పెంచి చూపిస్తూ.. కొన్ని వందలసార్లు తమ అనుకూల మీడియాలో వార్తలు వేయించుకుంటూ.. తప్పుడు ప్రచారాలు సాగించడం చంద్రబాబు స్టయిల్! చిన్న సంస్థ వస్తున్నా సరే.. ఇన్ని వందల కోట్లు పెడుతున్నారు.. ఇన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అని నారా తండ్రీ కొడుకులు పదేపదే చెబుతూ ప్రజల్ని మాయ చేస్తుంటారు. రెండు ఉదాహరణలు తీసుకుందాం. విశాఖలో గూగుల్ ఇన్నోవేషన్ హబ్ అంటున్నారు. దీనిద్వారా రాష్ట్ర యువతరానికి స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణలు అందుతాయని అంటున్నారు. అలా జరిగితే మంచిదే. అయితే గూగుల్‌ను తీసుకురావడం.. ఓ మహాద్భుతం అని చెప్పుకునే పాలకులు.. గూగుల్ మన రాష్ట్రంతో వ్యాపారం చేస్తున్నదని, మన డబ్బులనే వారికి చెల్లిస్తున్నాం తప్ప.. వారు తమ సంస్థ డబ్బు ఒక్క రూపాయి కూడా ఇక్కడ పెట్టుబడి రూపంలో పెట్టడం లేదు.. ఇక్కడ వారేమీ వందల వేల ఉద్యోగాలు ఇవ్వబోవడం లేదు.. అనేది దాచిపెడుతున్నారు. అయితే యువతరానికి నైపుణ్యాల ముసుగులో.. ఖజానా నుంచి రాచమార్గంలో దోచిపెడతారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అవసరమే. కానీ.. వాటిని పరిమితంగా ప్రారంభించి.. గూగుల్ కు దోచిపెట్టే డబ్బును.. సొంత నైపుణ్యాలు, సొంత ఆలోచనలు కలిగి ఉన్న యువతరానికి ఉచితంగా పెట్టుబడులుగా సమకూరిస్తే యువతరం మరింతగా బాగుపడుతుంది కదా.. అనే ఆలోచన ప్రభుత్వం వారు చేయరు. యువతరం కోసం అంటూ గూగుల్ కు వందల కోట్ల రూపాయలు సమర్పించుకోడానికి సిద్ధపడతారే తప్ప.. నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీని పట్టించుకోరు. ఇదంతా వంచన కాక మరేమిటి?.బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో ఒప్పందాలు కూడా ఇంచుమించు ఇలాంటివే. గేట్స్‌తో నలభై నిమిషాలు కూర్చోవడమే తన జీవితానికి అత్యున్నత విజయం అయినట్టుగా చాటుకుంటున్నారు చంద్రబాబునాయుడు. కానీ ఏం సాధించారు. ఈ ఒప్పందాల మర్మం ఏమిటి? అనేక రంగాలను జాబితాగా ప్రకటించి.. గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తుంది అని చెప్పేశారు. ఎన్ని వేల కోట్లు గేట్స్ ఫౌండేషన్ ఏపీకి ఇవ్వనున్నదో స్పష్టంగా చెప్పరు ఎందుకు? ఎందుకంటే.. వారు ఒక్కరూపాయి కూడా ఇవ్వడం లేదు. వారు ఆల్రెడీ తయారు చేసుకుని ఉన్న సాంకేతికతలను ఏపీ కోసం వాడుకోవడానికి వారికి రాష్ట్రప్రభుత్వమే వందల కోట్లు ముట్టజెప్పడానికి సిద్ధపడుతూ ఒప్పందాలు చేసుకుంటున్నదేమోనని ప్రజల అనుమానంగా ఉంది. ఆధునికత, సాంకేతికత, ఏఐ వంటి మాయాపూరితమైన పదాల ముసుగులో పది రూపాయల ఖర్చయ్యే వ్యవహారాలకు పదివేల రూపాయలు ముట్జజెప్పినా.. అది సామాన్యులకు బోధపడేసరికి పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. పాలన అవకాశం దక్కింది కదా అని ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా, తాను ఏ హామీలతో ప్రజలను బురిడీ కొట్టించారో వాటిని పట్టించుకోకుండా.. ఇలాంటి దొంగ చాటు దందాలు నడిపించడం ప్రజలను మోసం చేయడమేనని, ఇవే సంస్థల నుంచి పెట్టుబడుల రూపంలో, ఉద్యోగాల రూపంలో రాష్ట్రానికి ఏమైనా సాధిస్తే మాత్రమే చంద్రబాబు తన విజయంగా చెప్పుకోవాలని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు...ఎం. రాజేశ్వరి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement