- రూ.5 లక్షల ఆస్తినష్టం
మొబైల్‌షాపులో అగ్నిప్రమాదం
Published Mon, Aug 15 2016 1:22 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
నెల్లూరు (క్రైమ్) : విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మొబైల్‌షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు రూ.5లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. బుజబుజనెల్లూరుకు చెందిన వై. మోహన్ అదే ప్రాంతంలోని దర్గా సమీపంలో శ్రీవెంకటేశ్వర మొబైల్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. మొబైల్స్‌తో పాటు ద్విచక్రవాహనాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్‌ను సైతం విక్రయిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి మోహన్‌కు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే అప్పటికే దుకాణంలోని మొబైల్స్, రీచార్డ్ కార్డ్‌లు, ఇంజన్ అయిల్స్, స్పేర్‌పార్ట్‌లు, మోహన్ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. దుకాణం వెనుక వైపు ఉన్న కరుణాకర్ ఇంట్లోకి మంటలు వ్యాపించాయి. వారు మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ మొత్తం ఘటనలో రూ. 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
Advertisement
Advertisement