పూజా సామాగ్రికని వెళ్లి యువతి అదృశ్యం
Published Fri, Apr 8 2016 6:29 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM
చిలకలగూడ (హైదరాబాద్) : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి కనిపించకుండాపోయిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడకు చెందిన గోవిందకుమార్ కుమార్తె మనీషా (19) నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో పూజా సామగ్రి తెస్తానని కుటుంబసభ్యులకు చెప్పి బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరలేదు.
సన్నిహితులు, బంధుమిత్రులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో సోదరుడు సంజయ్‌కుమార్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, మనీషా ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
Advertisement
Advertisement