డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మహబూబన్ నగర్ జిల్లా గద్వాల టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.
మహబూబ్‌నగర్: డిగ్రీ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మహబూబన్ నగర్ జిల్లా గద్వాల టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండల కేంద్రానికి చెందిన అనూష (19) స్థానిక ఎస్‌వీఎం డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. గత ఏప్రిల్ 10న పరీక్షలు రాయడానికి అయిజ నుంచి గద్వాలకు బయల్దేరింది.
పరీక్ష రాసిన అనంతరం అనూష ఇంటికి చేరుకోలేదు. అనూష ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం తల్లి లక్ష్మిదేవి టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని టౌన్ ఎస్ఐ సైదాబాబు తెలిపారు.