
నల్గొండ (చింతపల్లి): చింతపల్లి మండలం వింజమూరు గ్రామానికి చెందిన మట్ట అనూష(20) మాల్ వెంకటేశ్వరనగర్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. బంధువులు గమనించి చింతపల్లి ఆస్పత్రికి, అక్కడి నుంచి మాల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అనూష మృతిచెందిందని ధ్రువీకరించారు. మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉండగా ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment