స్వైన్‌ఫ్లూతో మరో మహిళ మృతి
Published Fri, Jan 20 2017 2:08 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM
చిలకలగూడ: నగరంలో స్వైన్‌ప్లూతో చికిత్స పొందుతున్న మరో మహిళ మృతి చెందింది. పాతబస్తీ బహదూర్‌పురాకు చెందిన మహిళ(64) స్వైన్‌ఫ్లూతో కొద్దిరోజులుగా చికిత్స పొందుతోంది. అక్కడి నుంచి ఈ నెల 16న గాంధీ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. గత 20 రోజులుగా గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో నలుగురు మృతి చెందారు.
Advertisement
Advertisement