బాలుడి కాళ్లకు సంకెళ్లు.. నిర్బంధం! | minor boy chained to legs in hyderabad police station | Sakshi
Sakshi News home page

బాలుడి కాళ్లకు సంకెళ్లు.. నిర్బంధం!

Published Mon, Dec 15 2014 6:01 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

బాలుడి కాళ్లకు సంకెళ్లు.. నిర్బంధం! - Sakshi

బాలుడి కాళ్లకు సంకెళ్లు.. నిర్బంధం!

దొంగతనం కేసులో అనుమానం రావడంతో ఓ బాలుడిని పోలీసులు కాళ్లకు సంకెళ్లు వేసి నిర్బంధించారు. కస్టడీలోకి తీసుకుని లాకప్లో వేశారు. కోల్కతాకు చెందిన ఓ బాలుడు తన సోదరుడితో కలిసి హైదరాబాద్కు వలస వచ్చాడు. బాలుడి సోదరుడు  చాంద్రాయణగుట్టలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు.

వీళ్లిద్దరూ కలిసి సెల్‌ఫోన్లు దొంగిలించారన్నది పోలీసుల అభియోగం. కొన్ని ఫోన్లను కూడా బాలుడి వద్ద స్వాధీనం చేసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. సెల్‌ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలంటూ ఆరా తీస్తున్నామని తెలిపారు. అయితే బాలుడి కాళ్లకు సంకెళ్లు వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement