ఏడాదిగా మైనర్‌ బాలుడిపై అత్యాచారం చేస్తోన్న మహిళ | US Women Molested 14 Year Old Know Pregnant With Boy Child | Sakshi
Sakshi News home page

ఏడాదిగా మైనర్‌ బాలుడిపై అత్యాచారం చేస్తోన్న మహిళ

Published Sat, Mar 6 2021 12:25 PM | Last Updated on Sat, Mar 6 2021 2:33 PM

US Women Molested 14 Year Old Know Pregnant With Boy Child - Sakshi

వాషింగ్టన్: అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ఏడాది నుంచి పద్నాలుగేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడుతోంది. తాజాగా తాను సదురు బాలుడి వల్ల గర్భవతి అయినట్లు తెలిపింది. వివరాలు.. అర్కాన్సాస్ ప్రాంతానికి చెందిన బ్రిట్ని గ్రే అనే మహిళ ఏడాదిగా 14 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం నెరపుతోంది. దీని గురించి గతేడాది సెప్టెంబర్‌లో ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. అంతేకాక బ్రిట్ని మైనర్‌ బాలుడి వల్ల గర్భవతి అయినట్లు తెలిపాడు. 

సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు బ్రిట్ని నివాసానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బ్రిట్ని ఏడాది నుంచి  మైనర్‌ బాలుడితో శారీరక సంబంధం పెట్టుకున్నానని.. ప్రస్తుతం తాను రెండు నెలల గర్భవతిని అని పోలీసులకు వెల్లడించింది. ఈ క్రమంలో పోలీసులు బ్రిట్నిని ఈ నెల 1న అరెస్ట్‌ చేశారు. అనంతరం 5000 డాలర్ల పూచికత్తు మీద ఆమె విడుదలయ్యింది. ఏప్రిల్‌ 23న ఆమెని కోర్టు ముందు హాజరు పరచనున్నారు పోలీసులు.  

చదవండి: 
నిండు గర్భిణిని కాళ్లతో తొక్కి చంపేశారు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement