Terrifying Video Shows Woman Fight Off Attacker Inside Empty Gym In Florida - Sakshi
Sakshi News home page

Video: జిమ్‌లో యువతిపై అత్యాచారయత్నం.. నీచుడితో ఎలా పోరాడిందో చూడండి

Published Fri, Feb 17 2023 1:47 PM | Last Updated on Fri, Feb 17 2023 3:33 PM

Terrifying Video Woman Fight Off Attacker Inside Gym In Florida - Sakshi

జిమ్‌లో కసరత్తులు చేస్తున్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. జిమ్‌లోకి ప్రవేశించిన వ్యక్తి యువతి వద్దకు వచ్చి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. అగంతకుడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు తన శక్తికి మంచి ప్రయత్నించింది. కామాంధుడికి భయపడకుండా ధైర్యంగా పోరాడింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. జనవరి 22న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఫ్లోరిడాలోని టంపా నగరానికి చెందిన నషాలి అల్మా అనే 24 ఏళ్ల యువతి ఫిట్‌నెస్‌ మోడల్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌. తన అపార్ట్‌మెంట్‌లోని జిమ్‌లో వ్యాయామం చేస్తుంది. ఆ సమయంలో అక్కడ ఆమె ఒక్కతే ఉంది. ఇంతలో ఎవరో వ్యక్తి జిమ్‌లోకి వచ్చాడు. కొద్దిసేపు ఏదో పనిచేసుకుంటున్న నటిస్తూ అనంతరం వ్యాయామం చేసుకుంటున్న యువతి వద్దకు వచ్చాడు. ఆమెను బంధించడానికి ప్రయత్నించాడు.

గట్టిగా పట్టుకొని నేలమీద పడేసి లైంగికదాడికి ప్రయత్నించాడు. అయితే కామాంధుడికి చిక్కకుండా గట్టిగానే పోరాడింది నషాలి. భయపడకుండా ధైర్యంగా అతని బారి నుంచి తనను తాను రక్షించుకుంది. ఈ దృశ్యాలన్నీ జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు యువతి ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు. అలాగే ఆ నీచుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తనకు జరిగిన ఘోర అనుభవంపై బాధితురాలు మాట్లాడుతూ..‘ అతను నా వద్దకు రాగానే నేను దూరంగా తోశాను. ఏం చేస్తున్నావ్‌, దూరంగా వెళ్లు, నన్ను తాకడం ఆపు అని అరిచాను. అయినా తను వినలేదు. నా బలవంతం చేశాడు. తనకు దొరకకుండా ప్రయత్నించాను. అతనికి ఎదురు తిరిగి ధైర్యంగా పోరాడాను. చివరకు తను అక్కడి నుంచి వెళ్లిపోయాడు’ అని తెలిపింది. కాగా నిందితుడిని జేవియర్‌ థామస్‌-జోన్స్‌గా గుర్తించారు. పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement