అతి పెద్ద తుపాను బుధవారం రాత్రికే బలపడనుందని గురువారం తెల్లవారుజామున తాకే అవకాశం ఉందని నేషనల్ ఓషియానిక్ అట్మాస్పియర్ అడ్మినిస్ట్రేషన్(ఎన్‌ఓఏఏ) హెచ్చరించింది. ఈ తుపాన్ అమెరికాలోని మెక్సికో గల్ఫ్ మీదుగా పయనించి ఫ్లోరిడా రాష్ట్రం వైపుగా ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ఆ ప్రాంతంలో 1921 తర్వాత అదే స్థాయిలో ఈ తుపాను సంభవిస్తున్నట్లు పేర్కొంది.
ఈ తుపానుకి ఇయాన్ తుపాన్‌గా నామకరణం చేశారు. ఈ ఇయాన్ తుపాను ఫ్లోరిడాలోని తుంబా ప్రాంతానికి తాకుతుందని తెలిపింది. ఇప్పటికే అమెరికాలోని క్యూబా ప్రాంతాన్ని ఈ తుపాన్ అంధకారంలోకి నెట్టినట్లు అధికారులు తెలిపారు. అదీగాక ఆ ప్రాంతంలో యూఎస్ జాతీయ తుఫాను కేంద్రం(ఎన్‌హెచ్‌సీ) ఐదవ ప్రమాదకర విపత్తుగా హెచ్చరికలు జారీ చేసింది.
అంతేగాదు అక్కడ ఉన్న ప్రజలను తరలించే పనులను ముమ్మరంగా చేపట్టింది. పైగా గంటకు 250 కి.మీ దూరం నంచి బలమైన గాలులుతో కూడిన వర్షాలు వస్తాయని తెలిపింది. సుమారు రెండు అడుగుల మేర వర్షం కురిసే అవకాశ ఉందని అధికారులు భావిస్తున్నారు. రెండు రోజుల వరకు ఈ తుపాను ప్రభావం ఉంటుందని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ పేర్కొన్నారు. అధికారులు ఇప్పటికే సుమారు 2.5 మిలియన్ల మంది ప్రజలను తరలించినట్లు తెలిపారు. శాటిలైట్ సాయంతో సంగ్రహించిన ఐయాన్ తుపాన్ బలపడుతున్న వీడియోని నేషనల్ ఓషియానిక్ అట్మాస్పియర్ అడ్మినిస్ట్రేషన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
As #HurricaneIan churns near Cuba, #GOESEast can see its distinct eye as well as #lightning flashing around the storm.#Ian is a major Category 3 #hurricane that is continuing to strengthen in the southeastern Gulf of Mexico.
— NOAA Satellites (@NOAASatellites) September 27, 2022
Latest: https://t.co/FYrreOueMf pic.twitter.com/Rh85xqu0Rt
(చదవండి: మిసైల్ దూకుడు పెంచిన ఉత్తరకొరియా.. షాక్‌లో యూఎస్, దక్షిణ కొరియా)
Comments
Please login to add a commentAdd a comment