అమెరికాను వణికిస్తున్న హరికేన్‌ హెలెన్‌ | Huge Hurricane Helene Is Expected To Hit Florida City As A Major Storm And Strike Far Inland, See Details | Sakshi
Sakshi News home page

Florida Hurricane Update: అమెరికాను వణికిస్తున్న హరికేన్‌ హెలెన్‌

Published Thu, Sep 26 2024 12:31 PM | Last Updated on Thu, Sep 26 2024 1:14 PM

Huge Hurricane Helene Expected To Hit Florida City

వాషింగ్టన్‌: అమెరికాను హరికేన్‌ హెలెనా వణికిస్తోంది. మెక్సికో తీరం నుంచి అమెరికాలోని ఫ్లోరిడా దిశగా అతి తీవ్ర హరికేన్‌ హెలెన్‌ దూసుకెళ్తోందని యూఎస్‌ నేషనల్‌ హరికేన్‌ సెంటర్‌(ఎన్‌హెచ్‌సీ) వెల్లడించింది. హెలెన్‌ హరికేన్‌ కేటగిరి-3 లేదా కేటగిరి-4 హరికేన్‌గా బలపడే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌సీ అధికారులు చెబుతున్నారు.

హరికేన్‌ హెలెన్‌ ఫ్లోరిడా సిటీపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫ్లోరిడాలోకి దాదాపు పది కౌంటీలపై హరికేన్‌ ప్రభావం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక, ఇప్పటికే హరికేన్‌ ప్రభావంతో సిటీలో తీవ్రమైన గాలులతో కూడా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో వరద నీటిలో కార్లు మునిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక, హెలెన్‌ ప్రభావంతో పెనుగాలులు, కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని అమెరికా వాతారణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. 

 

 

ఇది కూడా చదవండి: న్యూక్లియర్‌ వార్‌కు సిద్ధం.. పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement