అందరూ చూస్తుండగానే దారుణం! | Minor Boy Beaten By Work Place Owner In Nizamabad | Sakshi
Sakshi News home page

పనిలోకి రాలేదని బాలుడిపై పైశాచికత్వం!

Published Wed, Aug 12 2020 5:07 PM | Last Updated on Wed, Aug 12 2020 7:46 PM

Minor Boy Beaten By Work Place Owner In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్: 12 ఏళ్ల బాలుడిని పనిలో పెట్టుకోవడమే కాకుండా ఓ వ్యక్తి అతని పట్ల రాక్షసంగా ప్రవర్తించాడు. పనిలోకి రావడం లేదని చెట్టుకు కట్టేసి చితకబాదాడు. కొట్టొద్దని ఆ బాలుడు యజమానిని ఎంతగా బతిమాలినా వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా కాళ్లకు తాడు కట్టి బాలుడిని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. నిజామాబాద్‌ జిల్లాలోని మల్కాపూర్‌లో బుధవారం ఈ దారుణం వెలుగుచూసింది. బాలుడిని యజమాని చిత్ర హింసలకు గురిచేస్తున్నా జనమంతా చోద్యం చూశారే తప్ప ఏ ఒక్కరూ ఆపలేదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.
(ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిందని అక్కాచెల్లెళ్లు..)

ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం
కాగా, మైనర్‌ బాలుడిపై దాడి ఘటనపై మల్కాపూర్‌ గ్రామాభివృద్ధి కమిటీ స్పందించింది. ఈ అమానుష దాడి ఘటనను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ దృష్టికి తీసుకెళ్తామని కమిటీ సభ్యులు చెప్పారు.  ఇదిలాఉండగా.. బాలుడిపై దాడి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో నిజామాబాద్‌ రూరల్ పోలీసులు మల్కాపూర్‌ చేరుకున్నారు. వివరాలు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement