
అనుకోకుండా అక్కపై కాల్పులు
భీండ్: మధ్యప్రదేశ్ భీండ్ జిల్లా లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ తమ్ముడి చేతిలో అక్కప్రాణాలు కోల్పోయిన ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తుపాకీతో ఆడుకుంటున్న ఓ మైనర్ బాలుడు అంజు (8) చేతిలో మరో మైనర్ బాలిక నిధి(10) ప్రాణాలు విడిచింది. తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఈ ఘటన కోట్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మపురి ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగింది.
భిండ్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పి) రాజేంద్ర వర్మ అందించిన సమాచారం ప్రకారం బాధిత బాలిక తండ్రి దినేష్ కుమార్ ఓఝా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో క్లర్క్ గా పనిచేస్తున్నారు. తండ్రికిచెందిన లెసెన్స్‌డ్ తుపాకీతో పిల్లలిద్దరూ తుపాకీతో మంచంమీద ఆడుకుంటుండగా, పొరపాటున అంజు ట్రిగ్గర్ నొక్కాడు. దీంతో తీవ్రమైన బుల్లెట్ గాయంతో నిధి అక్కడికక్కడే చనిపోయింది. అంతా క్షణాల్లో జరిగిపోవడం కుటుంబం కన్నీని సంద్రంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌పీ తెలిపారు.