పట్నా: తండ్రీ కొడుకులపై కాల్పులు జరిపి, ఒక బాలుడి మరణానికి కారణమైన వ్యక్తులను గ్రామస్తులు హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బీహార్లోని సీతామారి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీస్ ఉన్నతాధికారి హరి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం తమ మొబైల్ షాప్ను మూసివేసి ఇంటికి వెళ్తుండగా తండ్రీకొడుకులైన అవద్ కిశోర్ , రత్నేష్(12)లను సాయుధులైన నలుగురు దుండగులు అడ్డుకున్నారు.
వారి మధ్య స్వల్ప వివాదం జరిగింది. దీంతో వారు తండ్రీ కొడుకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈఘటనలో కొడుకు అక్కడికక్కడే చనిపోగా, తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహావేశానికి లోనయ్యారు. ఘటనా స్థలం నుంచి పారిపోతున్న నలుగురిపైన దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. పట్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
ముగ్గుర్ని కొట్టి చంపిన గ్రామస్తులు
Published Thu, Jul 2 2015 3:15 PM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM
Advertisement
Advertisement