ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, శివమొగ్గ(కర్ణాటక): మూడేళ్ల బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈఘటన శివమొగ్గ జిల్లా శికారిపుర తాలూకాలో గురువారం వెలుగు చూసింది. శికారిపుర గ్రామీణ పోలీసుల కథనం మేరకు.. తాలూకాలోని ఒక మారు మూల గ్రామానికి చెందిన 17 సంవత్సరాల బాలుడు తన ఇంటి పక్కన నివాసం ఉంటున్న దంపతుల కుమార్తె(3)పై కన్నేశాడు.
బాలిక ఆడుకుంటుండగా ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.చిన్నారి తల్లిదండ్రులు గమనించి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని అదుపులోకి తీసుకుని చిన్నారిని మెగ్గాన్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment