
కారుపై పడ్డ లిఫ్ట్ .. ఇద్దరి మృతి
ముంబై: మైనర్ బాలుడు కారు నేర్చుకోవడానికి ప్రయత్నించగా దురదృష్టవశాత్తూ, ఆ బాలుడితో పాటు డ్రైవింగ్ నేర్పిస్తున్న వ్యక్తి మృతిచెందారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... హఫీజ్(14) స్థానిక నాగపడా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కారు నేర్చుకోవాలని ఆశపడ్డాడు. జావేద్ (30) అనే వ్యక్తిని కారు డ్రైవింగ్ నేర్పించమంటూ కోరాడు. అయితే వాహనాన్ని గ్రౌండ్ లోనే, రోడ్డుపైనో కాకుండా ఓ పెద్ద బిల్డింగ్ లో శిక్షణ ఇస్తున్నాడు.
ఇక్బాల్ టవర్స్ అనే బిల్డింగ్ లో విశాలమైన స్థలం ఉండటంతో రెండో అంతస్థులో హఫీజ్ కు డ్రైవింగ్ నేర్పించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో కారును రివర్స్ చేస్తూ నడపటం ప్రారంభించాడు. జావేద్ సూచనలు వింటున్న మైనర్ బాలుడు కారును రివర్స్ చేస్తుండగా లిఫ్ట్ డోర్ ను ఢీకొట్టాడు. కారు లిఫ్ట్ లోకి దుసుకెళ్లి ఇరుక్కుపోయింది. ఆ సమయంలో థర్డ్ ఫ్లోర్ లో ఉన్న లిఫ్ట్ ఎలివేటర్ ఒక్కసారిగా కారుపై వచ్చి పడింది. దీంతో కారులో ఉండిపోయిన మైనర్ బాలుడు హఫీజ్ తో పాటు డ్రైవింగ్ నేర్పిస్తున్న జావేద్ అక్కడిక్కడే మృతిచెందారని పోలీసులు వెల్లడించారు.