అడిక్షన్‌ సెంటర్‌కి పంపించారన్న కోపంతో...కన్న తల్లిదండ్రులనే కడతేర్చిన కొడుకు | 16 Year Old Boy Kills His Parents With Axe For Sending Him Back To Rehab | Sakshi
Sakshi News home page

అడిక్షన్‌ సెంటర్‌కి పంపించారన్న కోపంతో...కన్న తల్లిదండ్రులనే కడతేర్చిన కొడుకు

Published Fri, Dec 17 2021 11:45 AM | Last Updated on Fri, Dec 17 2021 11:46 AM

16 Year Old Boy Kills His Parents With Axe For Sending Him Back To Rehab  - Sakshi

16 Year Old Boy Kills His Parents With An Axe: తల్లిదండ్రులను పిల్లల అబివృద్ధికై అహర్నిశలు పోరాడతారు. వాళ్ల అభివృద్ధిని తమ అభివృద్ధిగా భావించి ఎన్నో ప్రయాసలు పడి పెంచి పెద్ద చేస్తుంటే కొంతమంది ప్రబుద్ధుల తల్లిదండ్రల పై అత్యంత పాశవికమైన దాడులు చేయడమే కాక క్రూరమైన ఘాతుకాలకు పాల్పడతున్న ఉదంతాలే కోకొల్లలు. అచ్చం అలాంటి ఘటనే రాజస్తాన్‌లో చోటు చేసుకుంది.

(చదవండి: ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!)

అసలు విషయంలోకెళ్లితే... రాజస్తాన్‌లోన హనుమాన్‌ఘర్‌లోని ఒక గ్రామంలోని 16 ఏళ్ల మైనర్‌ బాలుడు మాదక ద్రవ్యాలకు బానిసై అయ్యాడు. దీంతో అతని తల్లిదండ్రులు కొడుకు జీవితం బావుండాలనే ఉద్దేశంతో డ్రగ్స్‌ డీ అడిక్షన్‌ సెంటర్‌కి  పంపించారు. అయితే సదరు బాలుడు కొన్ని రోజుల తర్వాత అక్కడ్నుంచి తప్పించుకుని తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కొడుకుని తమ ఇంటికి తీసుకెళ్లారు.

అంతేకాదు తననెందుకు డీ అడిక్షన్‌సెంటర్‌కి పంపించారంటూ సదరు బాలుడు తన తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో సదరు బాలుడు తనను మళ్లీ డీ అడిక్షన్‌సెంటర్‌కి పంపించే నిమిత్తమే తనను ఇంటికి తీసువచ్చారన్న కోపంతో నిద్రిస్తున్న తన తల్లిదండ్రలను అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి చంపేశాడు. దీంతో సమాచరం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి వచ్చి ఆ మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసినట్లు మీడియాకి తెలిపారు.

(చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement