Addictions
-
వీడియోలు, గేమింగ్, సోషల్‌మీడియా
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఆటలు, సామాజిక మాధ్యమాలు, వీడియోల వ్యసనం పిల్లలకు బాగా ఎక్కువైందని పట్టణప్రాంతాల్లోని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆన్లైన్ వేదికగా సర్వేలు నిర్వహించే ‘లోకల్‌సర్కిల్స్’ సంస్థ చేపట్టిన ఓ సర్వేలో ఇలాంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జనవరి–నవంబర్ కాలంలో దేశవ్యాప్తంగా 287 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. సర్వే ఫలితాల ప్రకారం.. ► తమ 9–17 ఏళ్ల వయసు పిల్లలు గేమింగ్, వీడియోలు, సోషల్‌మీడియాకు అతుక్కుపోయారని పట్టణ ప్రాంతాల్లోని తల్లిదండ్రుల్లో దాదాపు 40 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► తమ 13–17 వయసు పిల్లలు రోజూ సగటున 3 గంటలకుపైగా ఇదే పనిలో ఉంటున్నారని 62 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు ► 9–13 వయసు చిన్నారులు రోజూ కనీసం మూడు గంటలు సోషల్ మీడియా, వీడియోలు, గేమింగ్తోనూ గడుపుతున్నట్లు 49 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు ► సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్ ఖాతాలు ఓపెన్ చేయాలంటే కనీసం 13 ఏళ్లు వయసుండాలని ఆయా సంస్థలు చెబుతున్నాయి. కానీ, 13 ఏళ్లలోపే అంటే 9–13 ఏళ్ల తమ పిల్లలు వీటిని చూస్తున్నారని 47 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు ► పట్టణప్రాంతాల్లోని 13–17 వయసు పిల్లల్లో ఈ సంస్కృతి మరీ ఎక్కువ ఉందని 44 శాతం మంది పేరెంట్స్ అభిప్రాయపడ్డారు ► సోషల్‌మీడియా ఖాతా తెరిచేందుకు కనీస వయసును 13 ఏళ్లకు బదులు 15 ఏళ్లుగా సవరించాలని 68 శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ► ఆన్లైన్ తరగతులు, కొత్త విషయాలను నేర్చుకోవడంతోపాటు వినోదం కోసం కోవిడ్ తర్వాత ఇంటర్నెట్ను వాడుతున్న పట్టణప్రాంత చిన్నారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
ట్రెండ్: కుటుంబాలకు రీల్స్ గండం
33,500 మంది ఫాలోయెర్ల వల్ల ఒక గృహిణి ప్రాణం పోయింది. తమిళనాడులో తాజాగా ఈ ఘటన జరిగింది. ఫాలోయెర్లు పెరగడంతో రీల్స్ చేయడంలో పడి ఇంటిని పట్టించుకోని భార్యను క్షణికోద్రేకంలో భర్త కడతేర్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో మహిళ రీల్స్ వద్దన్నందుకు తన అన్నలిద్దరి మీదా దాడి చేసి పోలీస్ స్టేషన్ చేరింది. రీల్స్ అనేవి మహిళల ప్రతిభను వ్యక్తం చేసే సోషల్ మీడియా సాధనాలుగా ఉన్నాయి. కాని ఏ ప్రతిభా లేకపోయినా కేవలం ఫాలోయెర్ల కోసం వెర్రిమొర్రి రీల్స్ చేసే మహిళల వల్ల కుటుంబాలకు గండాలు వస్తున్నాయి. సోషల్ మీడియా అడిక్షన్ గురించి చైతన్యం రావాల్సిన సందర్భం వచ్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తే ఫాలోయెర్స్ వస్తారు. ఆదాయం కూడా వస్తుంది. 2000 మంది ఫాలోయెర్స్ వస్తే ‘ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్’గా గుర్తింపబడతారు. వీరు చేసిన రీల్స్ నెల రోజుల్లో 1000 మంది చూస్తే వీరికి బోనస్‌లు వస్తాయి. 10వేల మంది ఫాలోయెర్స్ ఉంటే ఒక స్థాయి... లక్ష దాటితే మరో స్థాయి. ఆ తర్వాత ప్రచారకర్తలే ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లతో ఉత్పత్తులకు ప్రచారం చేయించుకుంటారు. రకరకాల పద్ధతుల్లో ఆదాయం వస్తుంది కూడా. తమ ప్రతిభతో, నైపుణ్యాలతో ఈ రీల్స్ ద్వారా గుర్తింపు, గౌరవం పొందుతున్న స్త్రీలు ఎందరో ఉన్నారు. ఫిట్నెస్, లైఫ్‌స్టయిల్, స్టాండ్ అప్ కామెడీ, మిమిక్రీ, హెల్త్, యోగా... ఇలా అనేక రంగాల్లో నైపుణ్యం ఉండి వాటి ద్వారా రీల్స్ చేస్తూ సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారుతారు. ఈ రంగంలో కొందరు సగటు గృహిణులు, మహిళలు కూడా తమ వంటల ద్వారానో, చమత్కారమైన మాటల ద్వారానో, నృత్యాల ద్వారానో గుర్తింపు పొందుతున్నారు. అయితే తమకు ఉన్న చిన్నపాటి ప్రతిభకు కూడా కామెంట్లు, ఫాలోయెర్లు వస్తుండటంతో ఇక అదే లోకంగా మారిన వారు అవస్థలు తెచ్చుకుంటున్నారు. ఇరవై నాలుగ్గంటలు ఫోన్లో మునిగి, రీల్స్ తయారీలో నిమగ్నమయ్యి, కుటుంబాలలో కలతలకు కారణం అవుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో జరిగింది అదే. సాధించానని భ్రమసి చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపూరులో అమృతలింగం (38) లోకల్ మార్కెట్లో హమాలీగా పని చేస్తాడు. అతడి భార్య చిత్ర చిన్న గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తుంది. ముందు టిక్ టాక్, ఆ తర్వాత ఇన్‌స్టాలో రీల్స్ చేయడం మొదలుపెట్టిన చిత్ర దాదాపు 35 వేల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకుంది. దాంతో ఆమె అన్ని పనులు మాని ఈ రీల్స్ తయారీలో పడింది. అమృతలింగంకు ఇది నచ్చలేదు. ఇంటిని పట్టించుకోమని గొడవకు దిగేవాడు. అయితే రీల్స్ కింద వచ్చే కామెంట్స్ లో పొగడ్తలు నిండేసరికి చిత్ర తన ప్రతిభకు సినీ పరిశ్రమే సరైనదని భర్త మాట వినకుండా మూడు నెలల క్రితం చెన్నై చేరి వేషాలకు ప్రయత్నించసాగింది. వారం క్రితం ఒక ఫంక్షన్‌కు సొంత ఊరు వచ్చి తిరిగి చెన్నై బయలుదేరుతుండేసరికి అమృతలింగం గట్టిగా అడ్డు పడ్డాడు. చెన్నై వెళ్లకూడదని పట్టుపట్టాడు. ఇద్దరికీ మాటా మాటా పెరిగింది. క్షణికావేశంలో అతను చీరతో ఆమె మెడను బిగించాడు. స్పృహ తప్పేసరికి భయపడి వదిలేశాడు. కాని అప్పటికే ఆమె చనిపోయింది. వద్దు అంటే తిరుగుబాటు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆర్తి రాజ్‌పుత్ అనే యువతి ఈ రీల్స్‌కు బాగా అడిక్ట్ అయ్యింది. ఆమెకు ఇంటి విషయాలే పట్టడం లేదని సోదరులు జైకిషన్, ఆకాష్ అభ్యంతరం తెలిపారు. దాంతో ఆమె ఆ ఇద్దరు సోదరులపై దాడి చేసింది. వారు భయపడి పోలీసులను పిలిస్తే స్టేషన్లో మళ్లీ సిబ్బంది ఎదుటే సోదరులను కొట్టింది. అంతే కాదు... అడ్డుపడ్డ మహిళా పోలీసులపై దాడి చేసింది. దాంతో ఆమె కటకటాలు లెక్కించే స్థితికి వెళ్లింది. బతికున్నా లేనట్టే సోషల్ మీడియా అడిక్షన్ దాదాపుగా మనిషిని జీవచ్ఛవంలా మారుస్తాయని నిపుణులైన మానసిక వైద్యులు అంటున్నారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్, వాట్సప్‌లకు అడిక్ట్ అవుతున్నారు. లైక్‌లు, షేర్లు, సబ్స్క్రయిబ్లలో పడి చదువు, ఇంటి పని, బాధ్యతలు, లక్ష్యాలు మర్చిపోతున్నారు. భార్యాభర్తల్లో ఎవరు ఎడిక్ట్ అయినా కాపురంలో కలతలు, జగడాలు వస్తున్నాయి. పిల్లలు చదువును నష్టపోతున్నారు. ఫోన్ చూడొద్దంటే అలిగి ఇళ్ల నుంచి పిల్లలు పారిపోతున్నారు. అపరిచితులతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. లంఖణం దివ్యౌషధం అని పెద్దలు అన్నారు. సోషల్ మీడియా కు సంబంధించిన లంఖణాలు పెట్టడం మంచిదని నిపుణులు కూడా అంటున్నారు. రోజులో కొన్ని గంటలు ఫోన్ ముట్టుకోకుండా వారంలో ఒక రోజు సోషల్ మీడియా చూడకుండా పేపర్లు, పుస్తకాలు, స్నేహితులపై ధ్యాస మళ్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబంలో అందరి సమ్మతంతో గౌరవాన్ని, ఆదాయాన్ని ఇచ్చే విధంగా మీడియాను వాడితే కలత లు రావు. కాని కుటుంబ సభ్యుల విముఖతను లెక్క చేయకుండా సోషల్ మీడియాకే ప్రాధాన్యం ఇస్తుంటే ఇబ్బందులు తప్పవు. తస్మాత్ జాగ్రత్త. -
పబ్జీ ఆడొద్దన్నందుకు కుటుంబాన్నే కాల్చేశాడు..!
ఇస్లామాబాద్: సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్లైన్ క్లాసులు వినడానికి మొబైల్ ఫోన్లు కొనిస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు వీటిని ఆటల కోసం, అశ్లీల వీడియోలు చూస్తూ ఫోన్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. అయితే, కొందరు పిల్లలు పబ్జీ ఆటలకు, ఇతరవాటికి బానిసలుగా మారి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. పబ్జీ గేమ్‌కు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు బానిసలుగా మారిన విషయం మనకు తెలిసిందే. పబ్జీ ఆటకు బానిసలుగా మారి కొందరు తమ విచక్షణను కోల్పోతున్నారు. దీని కోసం.. కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటే.. మరికొందరు ఆడొద్దని వారించిన వారిని చంపిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నహిద్ ముబారక్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి కహ్నా ప్రాంతంలో ఉండేవాడు. ఈ క్రమంలో అతనికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, 14 ఏళ్ల అతని కుమారుడు కొన్ని రోజులుగా చదువుపై శ్రద్ధపెట్టడంలేదని అతని తల్లి వారించింది. అతను పబ్జీ ఆటను మానేయాలని హెచ్చరించింది. దీంతో విచక్షణ కోల్పోయిన బాలుడు.. తన తల్లితో సహా ఇద్దరు మైనర్ సోదరీమణులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. ఆ తర్వాత సదరు బాలుడు.. ఇంటి బయటకు వచ్చి అలారం శబ్ధం చేశాడు. తన కుటుంబాన్ని ఎవరో చంపారని తెలిపాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కాగా, నహిద్ తన కుటుంబ రక్షణ కోసం లైసెన్స్డ్ రివాల్వర్‌ను తన ఇంట్లో పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల తర్వాత నిందితుడు గన్ను ఎక్కడ పారేశాడో తెలియలేదు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు. కాగా, పాక్ పత్రిక డాన్ ప్రకారం.. ఆన్లైన్ పబ్జీ గేమ్ సంబంధించి ఇది నాల్గవ నేరమని తెలిపింది. కాగా, డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే గేమింగ్ డిజార్డర్‌ను ఒక వ్యాధిగా గుర్తించింది. వీరు ఈ ఆటకు బానిసలుగా మారి తమ విచక్షణను కోల్పోయి విపరీతంగా ప్రవర్తిస్తారని తెలిపింది. చదవండి: బీజేపీని ఓడించడమే తమ ఉమ్మడి సంకల్పం: అఖిలేష్ యాదవ్ -
అడిక్షన్ సెంటర్‌కి పంపించారన్న కోపంతో...కన్న తల్లిదండ్రులనే కడతేర్చిన కొడుకు
16 Year Old Boy Kills His Parents With An Axe: తల్లిదండ్రులను పిల్లల అబివృద్ధికై అహర్నిశలు పోరాడతారు. వాళ్ల అభివృద్ధిని తమ అభివృద్ధిగా భావించి ఎన్నో ప్రయాసలు పడి పెంచి పెద్ద చేస్తుంటే కొంతమంది ప్రబుద్ధుల తల్లిదండ్రల పై అత్యంత పాశవికమైన దాడులు చేయడమే కాక క్రూరమైన ఘాతుకాలకు పాల్పడతున్న ఉదంతాలే కోకొల్లలు. అచ్చం అలాంటి ఘటనే రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. (చదవండి: ఇలాంటి డ్రోన్ టెక్నాలజీ వద్దు!.... దెబ్బకు రూటు మార్చిన కంపెనీ!!) అసలు విషయంలోకెళ్లితే... రాజస్తాన్‌లోన హనుమాన్‌ఘర్‌లోని ఒక గ్రామంలోని 16 ఏళ్ల మైనర్ బాలుడు మాదక ద్రవ్యాలకు బానిసై అయ్యాడు. దీంతో అతని తల్లిదండ్రులు కొడుకు జీవితం బావుండాలనే ఉద్దేశంతో డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్‌కి పంపించారు. అయితే సదరు బాలుడు కొన్ని రోజుల తర్వాత అక్కడ్నుంచి తప్పించుకుని తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి వచ్చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కొడుకుని తమ ఇంటికి తీసుకెళ్లారు. అంతేకాదు తననెందుకు డీ అడిక్షన్‌సెంటర్‌కి పంపించారంటూ సదరు బాలుడు తన తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో సదరు బాలుడు తనను మళ్లీ డీ అడిక్షన్‌సెంటర్‌కి పంపించే నిమిత్తమే తనను ఇంటికి తీసువచ్చారన్న కోపంతో నిద్రిస్తున్న తన తల్లిదండ్రలను అత్యంత పాశవికంగా గొడ్డలితో నరికి చంపేశాడు. దీంతో సమాచరం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి వచ్చి ఆ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు మీడియాకి తెలిపారు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) -
ధూమపానం.. లంగ్ క్యాన్సర్ లింక్‌కు ఆధారాల్లేవు!
అహ్మదాబాద్: ఒక పేషెంటు అతిగా పొగతాగడం వల్ల మరణించాడని పేర్కొంటూ క్లెయిమ్ చెల్లించేందుకు నిరాకరించిన బీమా కంపెనీకి వినియోగదారుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సదరు పేషెంటుకు వైద్య బీమా వ్యయ మొత్తాన్ని ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. పొగతాగడం వల్లనే సదరు పేషెంటుకు లంగ్‌క్యాన్సర్ వచి్చందనేందుకు సరైన ఆధారాల్లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం చికిత్స రిపోర్టులో పొగతాగడం అలవాటైంది(అడిక్షన్ స్మోకింగ్) అని రాయడాన్ని తిరస్కరణకు కారణంగా పేర్కొనలేమంది. పొగతాగని వాళ్లకు కూడా లంగ్‌క్యాన్సర్ వస్తుందని గుర్తు చేసింది. అలోక్ కుమార్ బెనర్జీ అనే వ్యక్తి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించారు. అతని వైద్య చికిత్సకు అయిన రూ. 93,927 చెల్లించేందుకు బీమా కంపెనీ తిరస్కరించింది. దీంతో బెనర్జీ భార్య స్మిత కన్జూమర్ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం సదరు మొత్తాన్ని 7 శాతం వడ్డీతో కలిపి 2016 ఆగస్టు నుంచి లెక్కించి ఇవ్వాలని పేర్కొంది. -
మద్యం తాగి వచ్చాడు.. పెళ్లి బాజా మోగాల్సిన ఇంట..
శ్రీకాకుళం: పెళ్లి బాజా మోగాల్సిన ఇంట విషాదం నెలకొంది. మద్యం తాగి వచ్చిన వ్యక్తిని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపంతో కలుపు నివారణ మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దమల్లిపురం గ్రామంలో చోటు చేసుకోగా.. ఏనుగుతల దుర్యోధనరావు (55) ప్రాణాలు కోల్పోయాడు. పాతపట్నం ఎస్సై మహమ్మద్ అమీర్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమల్లిపురం గ్రామానికి చెందిన దుర్యోధనరావు కుమారుడు గిరిబాబుకు ఈ నెల 20వ తేదీ వివాహం జరగాల్సి ఉంది. అయితే ఆయన ఈ నెల 17వ తేదీన మద్యం తాగి ఇంటికి వచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు కల్పించు కొని పెళ్లి పనులు పూర్తి చేయకుండా మద్యం తాగి తిరగడం ఏమిటని దుర్యోధనరావును మందలించా రు. దీనికి మనస్తాపం చెందిన అతను పొలం గట్లపై గడ్డి నివారణ కోసం ఇంట్లో ఉంచిన మందును తాగా డు. కుటుంబసభ్యులు గమనించి ఆటోలో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుమారుడు గిరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం.. డబ్బు కోసం కన్నబిడ్డనే కిడ్నాప్!
కందుకూరు: వ్యసనాలకు బానిసై డబ్బు కోసం కన్నబిడ్డనే ఎత్తుకెళ్లి బెదిరింపులకు దిగాడు ఓ తండ్రి. డబ్బు ఇవ్వకపోతే బిడ్డను చంపి తాను చస్తానని కుటుంబ సభ్యులను బెదిరించాడు. వారు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కసాయి తండ్రి బారి నుంచి బాలుడిని కాపాడి తల్లికి అప్పగించారు. ఈ సంఘటన పొన్నలూరు మండలం చెరువుకొమ్ముపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. కందుకూరు పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కండె శ్రీనివాసులు ఆ వివరాలు వెల్లడించారు. చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన పల్నాటి రామకృష్ణారెడ్డి, ఉమ దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల వయసున్న బాలుడు శర్వాన్రెడ్డి ఉన్నాడు. రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో చెరువుకొమ్ముపాలెం వచ్చి ఇంటి వద్దే ఉండి విధులు (వర్క్ ఫ్రమ్ హోం) నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మద్యం, జూదం, వ్యభిచారం వంటి వ్యసనాలకు రామకృష్ణారెడ్డి బానిసయ్యాడు. దాదాపు రూ.20 లక్షలకుపైగా అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం లేకపోవడంతో డబ్బు కోసం గత నెల 28వ తేదీ తన మూడేళ్ల బాలుడు శర్వాన్రెడ్డిని బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు. అనంతరం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.20 లక్షలు డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే బాలుడికి మందు పోసి చంపుతానని, తాను కూడా అదే మందు తాగి చనిపోతానని బెదిరింపులకు దిగాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు రామకృష్ణారెడ్డి ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో గత నెల 30వ తేదీ పొన్నలూరు పోలీస్‌స్టేషన్‌లో భార్య ఉమ ఫిర్యాదు చేసింది. ఈ విషయం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ దృష్టికి వెళ్లడంతో ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కందుకూరు పట్టణంలోనే స్వర్ణ ప్యాలెస్ లాడ్జిలో రామకృష్ణారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. కందుకూరు డీఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీరామ్, పొన్నలూరు ఎస్సై రమేష్‌బాబు లాడ్జికి చేరుకుని మద్యం తాగి మత్తుగా పడుకుని ఉన్న రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి పక్కనే ఉన్న శర్వాన్రెడ్డిని తల్లి ఉమకు అప్పగించారు. రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
మద్యం అలవాటు: ప్రాణం తీసిన ఆకు పసరు
సాక్షి, కదిరి: పసరు వైద్యం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ ఘటన శుక్రవారం ఎన్పీకుంటలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా గాలివీడుకు చెందిన గంగరాజు కుమారుడు వేమల నారాయణ(38) కొంతకాలంగా ఎన్పీకుంటలోని ఓ కార్పెంటర్ వద్ద పనిచేస్తున్నాడు. మద్యానికి అలవాటు పడిన నారాయణ.. ఆ వ్యసనం నుంచి బయటపడాలని భావించాడు. ఈ క్రమంలోనే పులివెందుల సమీపంలోని సారాపల్లిలో మద్యం మానేందుకు పసరు వైద్యం చేస్తారని తెలిసి శుక్రవారం ఉదయం మరికొందరు మద్యం ప్రియులతో కలిసి అక్కడికి వెళ్లాడు. వారిచ్చిన ఆకు పసరు మందు తాగి మధ్యాహ్నానికి ఎన్పీ కుంటకు చేరుకున్నాడు. సాయంత్రం 4 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించి చుట్టుపక్కల వారు 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా...మార్గమధ్యంలోనే నారాయణ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నరసింహుడు ఈఘటనపై వివరాలు ఆరా తీసి కేసు నమోదు చేశారు. అలాగే నారాయణతో కలిసి పసరు వైద్యం చేయించుకున్న వారి వివరాలు సేకరించి వారిని ఆస్పత్రికి తరలించారు. చదవండి: ‘ఆమె’గా వల.. న్యూడ్ వీడియోలతో బ్లాక్మెయిల్ -
అష్ట వ్యసనాలతో అడ్డదారులు..!
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): చరవాణి, చెడు స్నేహం, అంతర్జాలం, ఫేస్బుక్, వాట్సప్, దూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలు ఇవన్నీ యువత పాలిట అష్ట వ్యసనాలై పట్టి పీడిస్తున్నాయి. పరిధిలు దాటి వాటిని వినియోగించడంతో భస్మసుర హస్తాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం కాలంలో స్కూల్‌కి వెళ్లే విద్యార్థి సైతం ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు. కాగా ఈ మధ్య కాలంలో పబ్జీ లాంటి వీడియో గేమ్‌లకు ఆకర్షితులై ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇటీవల ఓ విద్యార్థి పబ్జీ గేమ్ ఆడేందుకు తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తేగా, ఫోన్ కొనివ్వనందుకు ఆత్మహత్య చేసుకున్న విషయం వార్తల్లో రావడం ఆందోళన కలిగిస్తోంది. స్మార్ట్ ఫోన్ విషయంలోనే కాదు.. చాలా విషయాల్లో యువత పెడదోవ పడుతోంది. అయితే తల్లిదండ్రులు పిల్లన్ని గమనిస్తూ.. స్నేహితులుగా మారి వారిలో మార్పు తీసుకురావడమే ఈ వ్యసనాలకు అసలైన పరిష్కారం. కానీ పట్టించుకునే వారు లేకపోవడంతో విలువైన సమయం వృథా కావడంతో పాటు భావి పౌరుల జీవితాలు పక్కదారి పడుతున్నాయి. జీవితాన్నే మార్చేస్తున్న చరవాణి యువతను పట్టి పీడిస్తున్న భూతం ప్రధానంగా చరవాణే. నిద్ర లేచిన మొదలు నుంచి పడుకునే వరకు చరవాణితోనే జీవిస్తున్నారు. కేవలం చరవాణి వ్యహహారాలు చక్కబెట్టేందుకే సగటున రోజుకు 3 గంటల సమయాన్ని విద్యార్థులు వెచ్చిస్తున్నారని ఇటీవల పలు అధ్యాయనాల్లో వెల్లడైంది. తరగతుల్లో చాటు మాటుగా సెల్‌ఫోన్ మాట్లాడటానికి అలవాటు పడుతున్నారని అధ్యాపకులే చెబుతున్నారు. అలాగే ఆధునిక, వినూత్న మోడళ్ల ఫోన్ల కోసం అధిక వ్యయాలు చేస్తున్నారు. ఏది చేయాలి..? ఏదీ చేయకూడదో అనే విచక్షణ కొరవడి తాము చూసిన ప్రతిఅంశాన్ని చరవాణిలో చిత్రీకరిస్తూ ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. సెల్ఫీల మోజులో పడి అనుకోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. గ‘మ్మత్తు’ జీవితం చిత్తు మిత్రుల పొగడ్తల కోసమో, ఫోజులు కొట్టడానికో, సరదాకో.. అసలు అందులో ఏముందో చూద్దామనే మొదలైన మద్యపానం, దూమపానం, ఇవి యువత జీవితాన్ని చిత్తు చేస్తున్నాయి. పాఠశాల స్థాయి పిల్లలు కూడా మద్యపానం, దూమపానాన్ని సరాదాకు ప్రారంభించి కళాశాల స్థాయికి వచ్చే వరకు వాటికి బానిసలుగా మారుతున్నారు. పెళ్లి సంబరాలు, పుట్టిన రోజులు, కళాశాల సంబరాలు, పండుగ పబ్బాలు, ఇలా వేడుక ఏదైనా మద్యపానంతో మొదలయ్యే పరిస్థితి దాపురించింది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. తమ ప్రాణాలను తీసుకోవడమే కాకుండా ఇతరుల విలువైన ప్రాణాలను సైతం హరించడానికి కారణమవుతున్నారు. అశ్లీలతకు ఊతం.. అంతర్జాలం అరచేతిలో ఇమిడే చరవాణుల్లోనూ అత్యంత వేగంగా నడిచే అంతర్జాలం అందుబాటులోకి రావడంతో యువత వాటితోనే లోకంగా జీవిస్తోంది. వాస్తవానికి అంతర్జాలం ద్వారా ప్రపంచంలోని సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. అయితే అవసరాన్ని మించి వినియోగించడమే సమస్యలకు దారి తీస్తోంది. యవ్వనంలో కలిగే ఉద్వేగాలు విద్యార్థు పట్టిస్తున్నాయి. కామోద్రేకాన్ని పెంచే అంతర్జాల గూళ్లకు బానిసలై విచక్షణా, జ్ఞానం కోల్పోయి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కుటుంబ సభ్యులకు దూరమవుతూ.. జ్ఞాపకశక్తి, ఆలోచన విధానం తగ్గి అంతర్జాలం మీద ఆధారపడుతున్నారు. ఎక్కువ సేపు అంతర్జాలంతో గడపడం వల్ల నిద్రలేమి, నరాలు, కండరాలు సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. పరిధి దాటుతున్న స్నేహం చెడు స్నేహాల ముసుగులో ప్రపంచ పరిధిలు దాటి ఊహల్లో జీవిస్తున్నారు. స్నేహితుల ప్రోద్భలంతో బైక్ రేసులు, కారు రేసులతో విలువైన ప్రాణాలను పోగోట్టుకుంటున్నారు. కన్న వారితో కూడా పంచుకోలేని ఆవేదనను స్నేహితులతో పంచుకోవడం సహజం. కానీ ఇటీవల స్నేహాల పేరుతో యువత దుర్వ్యసనాలకు అధికంగా బలవుతున్నారు. పార్టీల పేరుతో పబ్బులకు అలవాటు పడుతున్నారు. కాగా కళాశాలలకు గైర్హాజరవుతూ చెడు స్నేహాల ముసుగులో విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.ఆధునిక వ్యసనాలుగా ఫేస్బుక్, వాట్సప్ యువలోకాన్ని పట్టి పీడిస్తున్న ఆధునిక వ్యవసనాలుగా ఫేస్బుక్, వాట్సప్‌లు మారాయి. చేతిలో పుస్తకం లేకపోయినా ఫేస్బుక్ లేని యువత కనబడదు. ఫేస్బుక్, వాట్సప్‌లలో వ్యక్తిగత సంఘటనలు, అశ్లీల వాఖ్యలు, చిత్రాల పోస్టింగులు పెడుతూ.. ఇబ్బందికర జీవితాలను గడుపుతున్నారు. లైక్‌లు, షేర్ల మోజులో ఇతర జీవిత చిత్రాలను పోస్ట్ చేస్తున్నారు. డిప్రెషన్‌కు లోనవుతారు యువత సమయాన్ని సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సప్, ఇంటర్నెట్, మత్తుపదార్థాలు, ఆల్కహాల్, గంజాయి, సిగరెట్ల ద్వారా వృథా చేసుకుంటున్నారు. ఇంటర్నెట్, సినిమాల ద్వారా నేర ప్రవృత్తిని నేర్చుకుంటున్నారు. అతిగా ఇంటర్నెట్కు అలవా టు పడితే ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో ప్రతిరోజూ కనీసం అరగంట కేటాయించాలి. వారితో స్నేహపూర్వకంగా ఉంటూ చెడు అలవాట్లు ఉంటే మానుకోవాలని స్నేహ పూర్వకంగా చెప్పండి. ఇంటర్నెట్, సోషల్ మీడియాకు అలవాటు కాకుండా అవగాహన కల్పించండి. విద్యాసంస్థలలో చదువుతో పాటు విద్యార్థులకు సమయం, విలువలు, సంస్కారం నేర్పించడం వల్ల మార్పు వస్తుంది. – డాక్టర్ విశాల్, మానసిక వైద్య నిపుణులు, నిజామాబాద్ ఇంటర్నెట్తో ఉపయోగమెంతో, ప్రమాదమంతే.. ఇప్పుడున్నది ఇంటర్నెట్ యుగం కాబట్టి ఎంతగా ఉపయోగమో, అంతే స్థాయిలో నష్టం కూడా జరుగుతోంది. నేటి కాలంలో ప్రతిఒక్కరూ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అవసరాలకు వాటిని వినియోగించుకోకుండా చెడు మార్గాలకు వేదికగా మార్చుకుంటున్నారు. కాబట్టి పిల్లలకు, విద్యార్థి దశలో ఉన్న వారిని సెల్ఫోన్లకు, ఇంటర్నెట్కు దూరంగా ఉంచడమే మేలు. – రవిశ్రీ, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ, వ్యవస్థాపకులు -
కోటీశ్వరుడవ్వాలని..
బొల్లారం: వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు గుర్రపు పందెం ద్వారా కోటీశ్వరుడు కావాలనుకున్నాడు. హైదరాబాద్‌లోని బ్యాచిలర్స్ హాస్టళ్లలో ల్యాప్‌టాప్‌లు చోరీ చేయడంతో పాటు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి నగర పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. సదరు కేటుగాడిని తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేసి.. 40 ల్యాప్‌టాప్‌లు, 35 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బేగంపేట ఏసీపీ గణేష్‌రెడ్డి, తిరుమలగిరి ఇన్స్పెక్టర్ సత్తయ్యతో కలిసి విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరిజిల్లా నిడదవోలుకు చెందిన కమెపల్లి కృష్ణమోహన్ అలియాస్ కార్తీక్ అలియాస్ క్రిష్ (35) బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చదువుకు స్వస్తి చెప్పి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. 2002 వరకు సినీ పరిశ్రమలో సహాయ నిర్మాతగా కొనసాగాడు. నిర్మాతగా ఆశించినంత డబ్బు రాకపోవడం.. వ్యసనాలకు బానిస కావడంతో గుర్రపు పందాలు కాసి త్వరగా కోటీశ్వరు కావాలనుకున్నాడు. ఇందుకు అవసరమైన డబ్బు కోసం 2003 నుంచి చోరీల బాట పట్టాడు. నగరంలోని బ్యాచిలర్స్ హాస్టళ్లతో పాటు తాళం వేసి ఉన్న ఇళ్లలోనూ చోరీలు చేస్తున్నాడు. చోరీ సొత్తును కర్ణాటకలోని మైసూర్లో విక్రయించేవాడు. అక్కడే మకాంపెట్టి వచ్చిన డబ్బుతో గుర్రపు పందాలు ఆడుతూ జల్సాలు చేస్తున్నాడు. ఉన్నత కుటుంబం... నిందితుడు కృష్ణమోహన్ది ఉన్నత కుటుంబం. తల్లి విశ్రాంత ఉపాధ్యాయురాలు కాగా.. సోదరులు ఉన్నత చదువులు చ దివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. అయితే, వ్యసనాలకు బానిసైన కృష్ణమోహన్ బీటెక్‌ను మధ్యలోనే ఆపేసి, సులభంగా కోటీశ్వరుడు కావాలనే దురాశతో ఘరానా దొంగగా మారి జైలు పాలుకావడం గమనార్హం. సెంచరీ దాటిన కేసులు... కృష్ణమోన్ జంటనగరాల్లోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో 117 చోరీలకు పాల్పడి పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌గా మారాడు. ఇతడిపై 15 నాన్‌బెయిలబుల్ కేసులు ఉన్నాయి. ఎస్ఆర్నగర్ ఠాణా పరిధిలో మొదటసారి చోరీ చేశాడు. మూడు చోరీలు చేసి పోలీసులకు చిక్కాడు. తర్వాత 2009లో మాదాపూర్‌లో 52 చోరీలు చేసిన కృష్ణమోహన్ 2012లో ఎస్సార్‌నగర్‌లో 22, మారేడ్‌పల్లిలో 2, మల్కాజిగిరిలో 6, ఇవే కాకుండా పంజగుట్టతో పాటు జంటనగరాలలో వివిధ ఠాణా పరిధి మొత్తం 117 దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న ఇతడిని బుధవారం తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిను గుర్రపు పందాలు ఆడి త్వరగా కోటీశ్వరుడు కావాలనే ఉద్దేశంతో చోరీలు చేస్తున్నట్టు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించారు. నిందితుడి నుంచి పోలీసులు 40 ల్యాప్‌టాప్‌లు, 35 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్‌కు తరలించారు. -
మృగంలా మారాడు
న్యాయ విద్యార్థినిపై సహచరుని అత్యాచారం నగరంలో కలకలం వ్యసనాల మత్తులో చిత్తయ్యాడు. విచక్షణ కోల్పోయాడు. తాను చదువుతున్న న్యాయశాస్త్ర పరువునూ మంటగలిపాడు. మద్యం సేవించి మృగంగా మారాడు. నిద్రిస్తున్న సహచర విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. సరదాగా వ్యవహరిస్తూ కలసిమెలసి ఉంటున్న మిత్రుడే రాక్షస అవతారమెత్తడంతో బాధిత విద్యార్థిని నిర్ఘాంతపోయింటది. కన్నీరుమున్నీరయింది. ఈ ఘోరసంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన దామోదరం సంజీవయ్య కళాశాలలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. న్యాయ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన విద్యార్థి లోకంలో సంచలనమైంది.