
అమ్మాయి మేజర్ అబ్బాయి మైనర్!
అధికారులు వచ్చేలోగా బాల్యవివాహం
శివ్వంపేట : మెదక్ జిల్లా శివ్వంటపే మండలం తాళ్లపల్లి తండాలో మైనర్ అబ్బాయి, మేజర్ అమ్మాయిలకు వివాహం జరిగింది. తండాకు చెందిన 20 ఏళ్ల అమ్మాయికి, కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ పంచాయతీ ఉసేన్‌గడ్డ తండాకు చెందిన 16 ఏళ్ల యువకుడితో శనివారం ఉదయం 11:30కి పెళ్లి చేసేందుకు ఇరుకుటుంబాలు ఏర్పాట్లు చేసుకున్నారు.
బాల్యవివాహం జరుగుతుందని తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్, ఐసీడీఎస్ సిబ్బంది ఉదయం 9 గంటలకు తండాకు చేరుకోగా అప్పటికే పెళ్లి చేసేశారు. అయితే అధికారులు వారికి కౌన్సెలింగ్ నిర్వహించి అమ్మాయిని అబ్బాయి వెంట అత్తగారింటికి పంపించమని రాతపూర్వకంగా రాయించుకున్నారు.