Tamil Nadu: Coimbatore Man Marries African Girl In Indian Tradition, Details Inside - Sakshi
Sakshi News home page

ఇండియన్‌ అబ్బాయి.. ఆఫ్రికా అమ్మాయి.. అలా ఒకటయ్యారు!

Published Sun, May 1 2022 4:11 PM | Last Updated on Sun, May 1 2022 5:41 PM

Tamil Nadu: Coimbatore Youth Marries African Girl Indian Tradition - Sakshi

తిరువొత్తియూరు(చెన్నై): కోవైకి చెందిన యువకుడు ఆఫ్రికాకు చెందిన యువతిని ప్రేమించి తమిళ సాంప్రదాయంలో వివాహం చేసుకున్నాడు. వివరాలు.. ఆఫ్రికా దేశమైన కెమెరూన్‌లోని ఓ సంస్థలో కోవైకి చెందిన ముత్తు మారియప్పన్‌ పని చేస్తున్నాడు. ఇతను పనిచేస్తున్న సంస్థలో వాల్మీ ఇనాంగో అనే ఆఫ్రికా యువతి అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఆ సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు.

ఈ మేరకు తమిళ సంప్రదాయం ప్రకారం కోవై తుడియలూర్‌లో ఉన్న ఓ వివాహ మండపంలో వివాహం జరిపించారు. వివాహ వేదిక పైకి వాల్మీఇనాంగో పట్టు చీర ధరించి తమిళ సాంప్రదాయంలో మెరిసింది. మారిముత్తు వధువు మెడలో తాళి కట్టాడు. ఆ తరువాత వీరిద్దరూ క్రైస్తవ ఆచారం ప్రకారం ఉంగరాలు మార్చుకున్నారు. కాగా, వివాహానికి వధువు తరుపున హాజరైన ఆఫ్రికా వాసులు పట్టు పంచెలు, పట్టు చీరలు కట్టుకుని హాజరుకావడం అందరినీ ఆకట్టుకుంది. ఽ

చదవండి: ఏడు లక్షలిస్తాం... ఏం మాట్లాడొద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement