తమిళనాడులోని కోయంబత్తూర్‌లో బీజేపీ కార్యాలయంపై కొందరు దుండగులు బాంబులు విసిరారు. పట్టణంలోని చితపుదూర్ ప్రాంతంలోని బీజేపీ కార్యాలయంపై బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ దాడి జరిగింది. కార్యాలయ భవనంపై గుర్తుతెలియని వ్యక్తులు రెండు పెట్రోల్ బాంబులు విసిరి వెనువెంటనే పరారయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటనకు సంబంధించి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు సమాచారం అందించామని వారు తెలిపారు. కాగా, దాడి సమయంలో కార్యాలయం మూసివేసి ఉందని, ఎవరికీ గాయాలైన సమాచారం లేదని పోలీసులు తెలిపారు