'సినిమాలంటే నాకు చచ్చేంత ఇష్టం' | Bigboss Fame Punarnavi Special Interview In Khammam | Sakshi
Sakshi News home page

ఆసక్తితోనే నటినయ్యా..

Published Wed, Jan 15 2020 9:10 AM | Last Updated on Wed, Jan 15 2020 9:17 AM

Bigboss Fame Punarnavi Special Interview In Khammam - Sakshi

సాక్షి, మధిర : చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టమని సినీనటి పునర్నవి అన్నారు. మధిర పట్టణంలోని వూట్ల వేణు నివాసంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెనాలిలో పుట్టి, విజయవాడలో చదువుకున్నాని, పక్కా తెలుగింటి అమ్మాయినని తెలిపారు. ఉయ్యాల జంపాలలో మొదటిసారిగా హీరోయిన్‌ పాత్ర చేశానని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 8 సినిమాల్లో నటించానని, ఒక చిన్న విరామం, సైకిల్‌ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పిట్టగోడ సినిమాలో తన పాత్ర సంతృప్తినిచ్చిందన్నారు. బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో 11 వారాలు ఉన్నానని, అది ఒక విలాసవంత జైలులాగా అనిపించిందని చెప్పారు. జర్నలిజం, సైకాలజీలో డిగ్రీ పూర్తిచేశానని, ఏడు సంవత్సరాలుగా సినీ రంగంలో కొనసాగుతున్నానని, భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాల్లో నటిస్తానని వివరించారు. ఈ సమావేశంలో వూట్ల వేణు, ఉమా మహేశ్వరి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement