సాక్షి, ఖమ్మం : కాంగ్రెస్ కంచుకోట ఖమ్మం జిల్లాలో కారుజోరు కొనసాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర కోటకు బీటలు పడ్డాయి. మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికారు టీఆర్‌ఎస్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం 8 వార్డుల్లో 5 చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీ సీపీఐ తలఒక్క స్థానంలో గెలుపొందాయి. మెజార్టీ స్థానాల్లో టీఆర్‌ఎస్ ముందంజంలో ఉంది. దీంతో మధిర మున్సిపాలిటీపై తొలిసారి గులాబీ జెండా ఎగరేసే అవకాశం కనిపిస్తోంది. టీడీపీతో కలిసి పోటీచేయాలని నిర్ణయించిన భట్టికి మరోసారి భారీ షాక్ తగిలినట్లయింది. (మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణి)
గత ఏడాది ముగిసిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించిన్పటికీ.. ఖమ్మంలో మాత్రం చేదు ఫలితాలు ఎదురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి, గులాబీ అధిపతి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించారు. దానికి తోడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా భట్టికి చెక్ పెట్టేందుకు మధిరపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగానే మున్సిపాలిటీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా కూడా టీఆర్‌ఎస్ జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం మొత్తం 120 మున్సిపాలిటీల్లో 75కుపైగా టీఆర్‌ఎస్ విజయం సాధించింది. మెజార్టీ స్థానాల్లో ముందంజంలో ఉంది. కార్పొరేషన్లలో కూడా కారు దూసుకుపోతోంది. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్‌డేట్స్)
Comments
Please login to add a commentAdd a comment