ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి దైవ సన్నిధిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మధిర (ఖమ్మం) : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి దైవ సన్నిధిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానిక బంజారా కాలనీకి చెందిన కొనుమూరి నాగేశ్వరరావు(48) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో మనస్తాసం చెంది రైల్వే స్టేషన్ సమీపంలోని రామాలయానికి చేరుకొని దైవ సన్నిధిలో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.