భారీ చోరీతో ఉలిక్కిపడ్డ మధిర | 11.5 kgs gold, 6 lakhs robbery in Madhira | Sakshi
Sakshi News home page

భారీ చోరీతో ఉలిక్కిపడ్డ మధిర

Published Sat, Nov 9 2013 3:21 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

11.5 kgs gold, 6 lakhs robbery in Madhira

మధిర, న్యూస్‌లైన్ : మధిర పట్టణంలోని శ్రీరాం సిటీయూనియన్ ఫైనాన్స్ కార్యాలయంలో గురువారం అర్ధరాత్రి జరిగిన భారీ చోరీ కలకలం సృష్టించింది.  ఈ సంఘటనలో 11.5కేజీల బంగారం, రూ.6ల క్షల నగదు అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. మొత్తం 3.5కోట్ల సొత్తు చోరీ అయినట్లు చెబుతున్నారు. అయితే ఈ చోరీయావత్తు మిస్టరీగా మారింది. ఘటన  పలు అనుమానాలకు తావిస్తోంది.
 
 గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని ఒక వ్యక్తి కార్యాలయానికి ఎడమవైపున ఉన్న కిటికీ చువ్వలను తొలగించి లోపలికి ప్రవేశించాడు. కార్యాలయంలో ఉన్న టేబుల్ డెస్క్‌లను వెతగ్గా కొన్ని తాళపుచెవులు దొరికాయి. వాటిని తీసుకుని లాకర్‌గదిలోకి ప్రవేశించాడు. అయితే అతను లాకర్ గదిలోకి  ప్రవేశించినప్పటినుంచి సీసీ కెమెరాలో నమోదైంది. సీసీ కెమెరాను పరిశీలించకుండా అతనిపని అతను చేసుకున్నాడు. దొరికిన తాళపు చెవులతో చిన్నలాకర్‌ను తెరచి అందులో ఉన్న బంగారాన్ని, నగదును సంచుల్లోకి సర్దుకున్నాడు. అయితే పెద్ద లాకర్‌కు సంబంధించిన ఒక తాళపుచెవి లేకపోవడంతో ఎంతసేపు ప్రయత్నించినప్పటికీ లాకర్ తెరుచుకోలేదు. ఇనుపరాడ్డుతో పగులకొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యంకాలేదు. దీంతో అతను దొరికినవరకు దోచుకుని అక్కడినుంచి ఉడాయించా డు. ఈ తతంగం మొత్తం సుమారు 2గంటలపాటు కొనసాగింది. గురువారం అర్ధరా త్రి 1.10గంటల సమయంలో లాకర్‌గదిలోకి ప్రవేశించిన నిందితుడు చోరీచేసిన బంగా రం, నగదు ఉన్న సంచులను తీసుకుని తిరిగి 2.48గంటలకు తాపీగా వెళ్లిపోయాడు. నింది తుడు లోపలికి ప్రవేశించినప్పటినుంచి ప్రతి కదలిక సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తోంది.
 
 ఎన్నో అనుమానాలు...  
 ఈ చోరీ జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజూ లాకర్‌లో పెట్టిన బంగారపు వస్తువులు, నగదుకు సంబంధించిన వివరాలను రిజిస్టర్‌లో నమోదుచేసి చిట్‌ఫండ్ కంపెనీ బ్రాంచ్ మేనేజర్, జూనియర్ నగదు అధికారి ఇద్దరూ  కార్యాలయానికి తాళాలువేసి చెరో తాళపుచెవి తీసుకుని వెళతారు. అయితే గురువారం అర్ధరాత్రి ఇరువురివద్ద ఉండే తాళపు చెవులను కార్యాలయంలోనే ఉంచి వెళ్లడం గమనార్హం. అదేవిధంగా సెక్యూరిటీగార్డు కూడా గురువారం అర్ధరాత్రి విధులకు హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చోరీకి పాల్పడిన వ్యక్తి చేతికి గ్లౌజులు, ముఖం కనబడకుండా రుమాలు చుట్టుకుని రావడాన్నిబట్టి చూస్తే చోరీల సంఘటనలో ఆరితేరిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ ఏడాది జనవరి మొదటివారంలో ఇదే కార్యాలయంలో చోరీ జరిగింది. అప్పుడు బంగారం, నగదు అపహరణ జరగకపోయినప్పటికీ తాకట్టుకు సంబంధించిన డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. గురువారం అర్ధరాత్రి  చోరీకి పాల్పడిన వ్యక్తి ఇంటిదొంగా లేదా బయటి వ్యక్తులా అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని వైరా డీఎస్పీ బి. సాయిశ్రీ, సీఐ జె. సదానిరంజన్ పరిశీలించారు.  చోరీ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలను పరిశీలించడంతోపాటు ఖమ్మంనుంచి వచ్చిన క్లూస్‌టీం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కార్యాలయంలో పనిచేసే కొంతమంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement