క్షణికావేశంలో కట్టుకున్నోడినే! | A Women Kills Her Husband In Khammam | Sakshi
Sakshi News home page

క్షణికావేశంలో కట్టుకున్నోడినే!

Mar 5 2021 8:05 AM | Updated on Mar 5 2021 8:15 AM

 A Women Kills Her Husband In Khammam - Sakshi

మధిర: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన భర్తను హతమార్చిన సంఘటన మండలంలోని దెందుకూరులో బుధవారం చోటుచేసుకుంది. ముక్కసాని పుల్లయ్య(45), సుజాత దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్యాభర్తల మధ్య స్వల్పఘర్షణ జరిగి పరస్పరం దాడి చేసుకున్నారు. పుల్లయ్యను సుబాబుల్‌ కర్రతో కొట్టగా తలకు దెబ్బ తగిలి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో చికిత్స నిమిత్తం మధిర సివిల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి కుమార్తె ఉంది. రూరల్‌ ఎస్‌ఐ రమేష్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   

చదవండి: దారుణం : కన్నబిడ్డనే చంపి నదిలో పడేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement