సాక్షి, మధిర: ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని కరోనా రహితంగా మార్చేందుకు స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి పల్లెకు, ప్రతిగడపకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామంలో పర్యటించిన ఆయన.. స్థానికంగా ఉన్న వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
ఈ సమయంలో పలువురు రైతులు వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలోని సమస్యలను భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువచ్చారు. లారీలు లేకపోవడంతో మొక్కజొన్నలు, ధాన్యం అక్కడి ఉండిపోయిందని వర్షం వస్తే తీవ్రంగా నష్టపోతామని వారు భట్టివి వివరించారు. దీనికి స్పందించిన భట్టి విక్రమార్క.. కొనుగోలు చేసిన ధాన్యం, మొక్కజొన్నలను వెంటనే తరలించేందుకు లారీలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాక రైతులకు ఇటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లుతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మాస్కులు, శానిటైజర్ల పంపిణీ
ఎడవల్లి గ్రామంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో హమాలీలు, కూలీలకు మాస్కులు, శానిటైజర్లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనాపై వారికి అవగాహన కల్పించారు. ముదిగొండ మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో పండ్లు, కూరగాయల అమ్మకం దార్లకు, పోలీసులు, వాలంటీర్లకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment