
మధిర(ఖమ్మం జిల్లా): మధిర పట్టణం ఆజాద్ రోడ్డులో నివాసముంటున్న కొల్లూరు సురేష్, సుమతీ దంపతుల కుమార్తె శ్రీలేఖ అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడింది. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ఎంఎస్ చదివేందుకు శ్రీలేఖ 3 నెలల క్రితం అక్కడకు వెళ్ళింది. ఈ రోజు ఉదయం 7 గంటలకు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది.
శస్త్ర చికిత్స అనంతరం ఐసీయూలో ఉంచారని కుటుంబసభ్యులకు సమాచారం అందింది. గాయపడిన యువతికి సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ను ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఒక్కగానొక్క కూతురు దేశం కానీ దేశంలో ప్రమాదానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.