ఖమ్మం జిల్లాలో మంగళవారం పలు చోట్ల భారీ వర్షం పడింది. కొత్తగూడెం, వైరా, ఖమ్మం, మధిర ప్రాంతాల్లో గాలివానతో బీభత్సం సృష్టించింది. కొత్తగూడెంలో అనేక చోట్ల విద్యుత్ తీగలు తెగడం, చెట్లు రోడ్లపై కూలడంతో రాత్రి వరకు కూడా విద్యుత్ సరాఫర కాకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
కెటీపీఎస్ నుంచి సీతరామపట్నం వచ్చే విద్యుత్ లైన్ ట్రిప్ కావడం, లక్ష్మీదేవిపల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్‌పై పిడుగు పడడంతో 5 లక్షల వరకు నష్టం జరిగింది. దీంతో విద్యుత్ సరాఫర నిలిచిపోయింది. పాల్వంచలో జాతీయ రహదారిపై పాత పాల్వంచ సమీపంలోభారీ వృక్షం రోడ్డుపై పడింది. దీంతో తెల్లవారుజామున 4 గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. మున్సిపల్ , పోలీసు అధికారుల చొరువతో సిబ్బంది చెట్టును తొలగించారు.
ఖమ్మం నగరంలో కూడా సాయంత్రం భారీ వర్షం పడింది. గాలివానతో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో నగరంలో రాత్రి 10 గంటల వరకు అంధకారం నెలకొంది. గాలి దుమారంతో బయ్యారం మండలం జగ్గుతండలో 3 విద్యుత్ స్తంభాలు విరిగాయి. వైరా, కొణిజర్లలో భారీ వర్షంతో వీధులన్నీ జలమయమయ్యాయి. మధిర, చింతకాని మండలాల్లో జల్లులతో వర్షం పడింది.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షం
Published Tue, May 27 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement