ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీరామ్ చిట్స్ శాఖ కార్యాలయంలో గత అర్థరాత్రి దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. దాంతో ఆ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉదయం మధిర పోలీసులను ఆశ్రయించారు. రూ.6 లక్షల నగదుతోపాటు కస్టమర్లు తాకట్టుపెట్టిన తొమ్మిది కిలోల బంగారం అపహరించుకు పోయారని శ్రీరామ్ చిట్స్ అధికారులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ బంగారం విలువ రూ. 2 కోట్లు ఉంటుందని శ్రీరామ్ చిట్స్ అధికారులు పోలీసులకు తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే పోలీసులు దోపిడి జరిగిన శ్రీరామ్ చిట్స్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ కేసును సాధ్యమైనంత త్వరలో ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసుల శ్రీరామ్ చిట్స్ కార్యాలయంలోని భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఆ చోరీపై పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఆ ఘటన స్థానికంగా కలకలం రేపింది.