బంగారం ఎత్తుకెళ్లిన కోతులు | Monkey thief robs jewellery At Komaram Bheem District | Sakshi
Sakshi News home page

బంగారం ఎత్తుకెళ్లిన కోతులు

Published Tue, Mar 3 2020 2:14 AM | Last Updated on Tue, Mar 3 2020 2:14 AM

Monkey thief robs jewellery At Komaram Bheem District - Sakshi

రెబ్బెన (ఆసిఫాబాద్‌): దొంగలు ఇంట్లో చొరబడి బంగారం ఎత్తుకెళ్లినట్లు సాధారణంగా వింటుంటాం. కానీ.. కోతులు ఇంట్లో చొరబడి బంగారు నగలు ఎత్తికెళ్లిన విచిత్ర సంఘటన కుమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో సోమవారం మధ్యాహ్నం కోతులు చొరబడి వంట గదిలో ఉన్న పప్పు డబ్బాలతో ఉడాయించాయి. అయితే.. ఆ డబ్బాలో సదరు ఉద్యోగి తల్లికి చెందిన రెండు తులాలు, కూతురుకు చెందిన తులం బంగారం చైన్‌ ఉన్నాయి. స్థానికుల సాయంతో చుట్టుపక్కల గాలించినా డబ్బాలు లభించలేదని వాపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement