కాంగ్రెస్‌లో చేరిన ఉషారాణి
సాక్షి, మధిర : టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. టీఆర్‌ఎస్ మధిర పట్టణ అధ్యక్షురాలు గూడెల్లి ఉషారాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమెను విక్రమార్క పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెలోపాటు, టీడీపీ మధిర ఇన్‌చార్జ్ డాక్టర్ వాసిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మధిర నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తానని భట్టి విక్రమార్క ప్రకటించారు. కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు అనుబంధంగా ఎర్రుపాలెంలో డ్రై పోర్టును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలకు కారమవుతున్న నకిలీ విత్తనాలను లేకుండా చేస్తామని, వందకోట్ల వ్యయంతో మధిర పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. మధిరను స్మార్ట్ సిటీగా చేసి, ముదిగొండ, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment