
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు
సాక్షి,మధిర: నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజా కూటమి బలపర్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్కను గెలిపించాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం అన్నారు. గురువారం మధిర పట్టణంలోని 16, 17వార్డుల్లో భట్టి తనయుడు మల్లు సూర్యవిక్రమాదిత్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రామనాథం మాట్లాడుతూ... భట్టి గెలుపొందితే రాబోయే ప్రజా కూటమి ప్రభుత్వంలో కీలక పదవిలో ఉంటారని తెలిపారు. అప్పుడు నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. హస్తం గుర్తుకే ఓటువేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్, టీడీపీ నాయకులు మల్లాది వాసు, అయితం వెంకటేశ్వరరావు, మల్లాది హన్మంతరావు, మాదల రామారావు, గోకర్ల చంద్రయ్య, శేఖర్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment