Newly Married Woman died
-
విషాదం: పెళ్లైన 24 రోజులకే నవ వధువు దుర్మరణం
సాక్షి, ఖమ్మం: బంధువుల ఇంట వేడుకకు హాజరై తిరుగుపయనమై వెళ్తుండగా నవ వధువును మృత్యువు కబళించింది. కృష్ణాజిల్లా నందిగామ మండలం అంబర్‌పేటకు చెందిన బలవంతపు మధు, సదా(24) కు ఫిబ్రవరి 14న వివాహమైంది. గంపలగూడెం మండలం చింతలనర్వలో బంధువుల ఇంట ఓ వేడుకకు వెళ్లారు. గురువారం అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరి స్వగ్రామానికి వస్తుండగా ఖమ్మం జిల్లాలోని మధిర మండలం రాయపట్నం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి బైక్ కిందపడింది. ఈ సంఘటనలో సదా తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు108 అంబులెన్స్‌లో మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించగా..అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ మనోరమ నిర్ధారించారు. బయల్దేరి 2కి.మీ.దూరం కూడా చేరలేదు. కాసేపటికే ఈ ప్రమాదం గురించి తెలియడంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు. కొత్త దంపతులు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుండగా దుర్ఘటన జరిగడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మధిర టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లయిన రెండో రోజే..
కాశీబుగ్గ: కాళ్ల పారాణి ఆరక ముందే ఓ నవ వధువు గుండెపోటుతో మృతి చెందింది. పలాస మండలం గరుడఖండి గ్రామంలో పెళ్లయిన రెండో రోజునే నవవధువు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన సిగిలిపల్లి వరలక్ష్మి కుమార్తె దమయంతికి తురలకకోటకు చెంది న గోపీనాథ్ అలియాస్ సురేష్‌కు ఇచ్చి ఈ నెల 28వ తేదీ గురువారం రాత్రి నందిగాం మండలం సుబ్బమ్మపేట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వివాహం జరిపించారు. శనివారం ఉదయం ఐదు గంటలకు దమయంతికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే సమయంలోనే మృతి చెందింది. కాళ్ల పారాణి ఆరకుండానే దమయంతికి నూరేళ్లు నిండిపోవడంతో కన్నవారు, అత్తింటి వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటన ఈ పరిసర ప్రాంతాల్లో సంచలనంగా నిలిచింది. -
నవవధువు బలవన్మరణం
అదనపు కట్నం కోసమే ప్రాణాలు తీశారంటున్న మృతురాలి తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం రూరల్: అదనపు కట్నం వేధింపులు తాళలేక అనుమానాస్పద స్థితిలో ఓ నవ వధువు బుధ వారం మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం నాగన్‌పల్లికి చెందిన పాండాల బాల శివుడికి దండుమైలారం గ్రామానికి చెందిన నాటి సత్తయ్య కూతురు ప్రశాంతితో ఎనిమిది నెలల క్రితం వివాహ మైంది. బాలశివుడు ఆర్టీసీ డిపోలో మెకానిక్. 5 నెలల క్రితం ప్రశాంతికి సీమం తం కూడా చేశారు. అప్పటి నుంచి అదనపు కట్నం కావాలని, గర్భస్రావం చేయించుకోవాలని తరచూ ఘర్షణకు దిగేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ప్రశాంతి తల్లిగారింటికి వెళ్లింది. తల్లిదండ్రులు నచ్చజెప్పి మంగళవారం నాగన్ పల్లికి తీసుకొచ్చారు. రాత్రి బెడ్రూం తలుపులు వేసుకొని ఫ్యాన్‌కు ఉరేసుకుంది.