నవవధువు బలవన్మరణం | Newly Married Woman Killed For Extra Dowry | Sakshi
Sakshi News home page

నవవధువు బలవన్మరణం

Published Thu, Jul 13 2017 2:36 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

నవవధువు బలవన్మరణం

నవవధువు బలవన్మరణం

అదనపు కట్నం కోసమే ప్రాణాలు తీశారంటున్న మృతురాలి తల్లిదండ్రులు
ఇబ్రహీంపట్నం రూరల్‌: అదనపు కట్నం వేధింపులు తాళలేక అనుమానాస్పద స్థితిలో ఓ నవ వధువు బుధ వారం మృతి చెందింది.  రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీం పట్నం మండలం నాగన్‌పల్లికి చెందిన పాండాల బాల శివుడికి దండుమైలారం గ్రామానికి చెందిన నాటి సత్తయ్య కూతురు ప్రశాంతితో ఎనిమిది నెలల క్రితం వివాహ మైంది.  

బాలశివుడు ఆర్టీసీ డిపోలో మెకానిక్‌. 5 నెలల క్రితం  ప్రశాంతికి సీమం తం కూడా చేశారు. అప్పటి నుంచి అదనపు కట్నం కావాలని, గర్భస్రావం చేయించుకోవాలని తరచూ ఘర్షణకు దిగేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ప్రశాంతి తల్లిగారింటికి వెళ్లింది. తల్లిదండ్రులు నచ్చజెప్పి మంగళవారం నాగన్‌ పల్లికి తీసుకొచ్చారు. రాత్రి బెడ్‌రూం తలుపులు వేసుకొని ఫ్యాన్‌కు ఉరేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement