Additional dowry harassment
-
అదనపు కట్నం కోసమే హత్య
కర్ణాటక: అదనపు కట్నం కోసం తన కుమార్తె శిల్పాను హత్య చేశారని మృతురాలి తండ్రి ఇల్లూరు గోపాలయ్య పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడారు. తన కుమార్తెను హత్య చేసి మిద్దె పైనుంచి పడి మరణించినట్లు ఆమె భర్త శరత్ కుటుంబ సభ్యులు అబద్ధం చెబుతున్నారన్నారు. నగరంలోని జవహర్ నగర్‌కు చెందిన శరత్‌తో శిల్పకు గత ఏడాది జూన్ 10న కర్నూలు జిల్లా ఆదోనిలోని చిక్కోరి ఫంక్షన్ హాల్లో ఘనంగా వివాహం జరిపామన్నారు. పెళ్లి సమయంలో రూ.25 లక్షల కట్నం, 25 తులాల బంగారం ఇచ్చామన్నారు. రెండు నెలల పాటు భార్యభర్తల మధ్య సంసారం చక్కగా సాగిందన్నారు. అనంతరం శిల్పకు మానసికంగా వేధింపులు ప్రారంభమయ్యాయన్నారు. రెండు మార్లు పెద్దల సమక్షంలో రాజీ చేసి సంసారాన్ని చక్కదిద్దామన్నారు. గతేడాది దీపావళికి రెండు తులాల బంగారు ఇచ్చి పంపామన్నారు. వారం రోజుల క్రితం తనను అత్త శశికళ, మామ సురేష్, ఆడబిడ్డ సుశ్మిత, భర్త ప్రవీణ్ కుమార్ మరింత కట్నం తేవాలని వేధిస్తున్నారని, తాను ఆదోనికి వస్తానని తనను పిలుచుకెళ్లాలని గత సోమవారం శిల్ప తనతో ఫోన్లో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. అయితే మంగళవారం రాత్రి రెండు కాళ్లు, చేతులు, కడుపు వద్ద గాయాలు చేశారని, ఎడమ వేలిని విరిచేశారన్నారు. భర్త మేడ పైనుంచి ఆమెను కిందకు తోసి హత్య చేసి పరారయ్యాడని తెలిపారు. తన కుమార్తెను హత్య చేసి మేడ పైనుంచి కింద పడి మరణించిందని కుటుంబ సభ్యులు అబద్ధమాడారని ఆరోపించారు. కాగా జిల్లా ఎస్పీ నిఖిల్ శుక్రవారం శరత్ నివాసాన్ని శిల్ప తల్లిదండ్రుల సమక్షంలో పరిశీలించారు. -
నవవధువు బలవన్మరణం
అదనపు కట్నం కోసమే ప్రాణాలు తీశారంటున్న మృతురాలి తల్లిదండ్రులు ఇబ్రహీంపట్నం రూరల్: అదనపు కట్నం వేధింపులు తాళలేక అనుమానాస్పద స్థితిలో ఓ నవ వధువు బుధ వారం మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం నాగన్‌పల్లికి చెందిన పాండాల బాల శివుడికి దండుమైలారం గ్రామానికి చెందిన నాటి సత్తయ్య కూతురు ప్రశాంతితో ఎనిమిది నెలల క్రితం వివాహ మైంది. బాలశివుడు ఆర్టీసీ డిపోలో మెకానిక్. 5 నెలల క్రితం ప్రశాంతికి సీమం తం కూడా చేశారు. అప్పటి నుంచి అదనపు కట్నం కావాలని, గర్భస్రావం చేయించుకోవాలని తరచూ ఘర్షణకు దిగేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ప్రశాంతి తల్లిగారింటికి వెళ్లింది. తల్లిదండ్రులు నచ్చజెప్పి మంగళవారం నాగన్ పల్లికి తీసుకొచ్చారు. రాత్రి బెడ్రూం తలుపులు వేసుకొని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. -
అత్తింటి వేధింపులకు బలి
భర్త, అత్తమామలే హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ కొడకండ్ల : అదనపు వరకట్న వేధింపులకు వివాహిత బలైన ఘటన మండలంలోని రేగుల గ్రామంలో గురువారం చోటుచేసుకొంది. తమ కుమార్తెను అత్తింటి వారు హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. నెక్కొండ మండలం రెడ్లవాడకు చెందిన పల్లెకొండ నర్సయ్య–నర్సమ్మల కుమార్తె లావణ్య(19)ను రేగుల గ్రామానికి చెందిన రాయారపు యాకయ్య–సాయమ్మల కుమారుడు అశోక్‌కు ఇచ్చి 8నెలల క్రితం రూ.3లక్షల కట్నకానుకలు ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత నెలరోజులకే భర్త, అత్త, మామలు అదనపు కట్నం కోసం వేధించసాగారు. దీంతో లావణ్య తల్లిదండ్రులు, బంధువులు వచ్చి వారిని నిలదీయగా ఇక నుంచి మంచిగా చూసుకొంటామని అన్నారు. కానీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో నెల రోజుల క్రితం లావణ్య తల్లిదండ్రులు అప్పు చేసి రూ.80 వేలు ఇచ్చారు. అయినా వేధింపులు ఆపలేదని, వారు తీవ్రంగా కొట్టడం వల్లే తమ కూతురు మృతి చెందిందని, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని నర్సయ్య, నర్సమ్మ విలపించారు. లావణ్య మృతి విషయం తెలిసి తాము వచ్చేసరికే ఆ ముగ్గురూ పరారయ్యారని చెప్పారు. తమ కుమార్తెను గొంతు నులిపి, కొట్టారని, చాతిపై, వీపులో గాయాలు ఉన్నాయని తెలిపారు. లావణ్య భర్త, అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. వారి ఫిర్యాదు మేరకు అశోక్, యాకయ్య, సాయమ్మపై కేసు నమోదు చేసినట్లు పాలకుర్తి సీఐ కరుణాసాగర్‌రెడ్డి, ఎస్సై ఎంబాడి సత్యనారాయణలు తెలిపారు.