చైన్ స్నాచర్లను ధైర్యంగా ఎదుర్కొంది! | woman injured while trying to catch thieves | Sakshi
Sakshi News home page

చైన్ స్నాచర్లను ధైర్యంగా ఎదుర్కొంది!

Published Fri, Aug 19 2016 8:04 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

woman injured while trying to catch thieves

హైదరాబాద్: మార్నింగ్ వాకింగ్కు వెళ్లిన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును అపహరించేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. ఆ మహిళ వెంటనే అప్రమత్తమై చైన్ స్నాచర్లను ప్రతిఘటించడంతో పాటు వారిని వెంటాడింది. బైక్ వెంట పరిగెత్తి వారిని పట్టుకొవడానికి యత్నించింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చందానగర్ డివిజన్ సురక్ష హిల్స్‌లో శుక్రవారం చోటు చేసుకుంది.


బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సురక్షహిల్స్‌కు చెందిన రాధాబాయి శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లింది. మోటార్ సైకిల్ పై వచ్చిన దొంగలు ఆమె వాకింగ్ చేస్తున్న సమయంలో మెడలో నాలుగు తులాల బంగారు గొలుసును అపహరించడానికి యత్నించారు. రాధాబాయి వారిని ధైర్యంగా అడ్డుకొంది. ఈ క్రమంలో ఆమె బైక్‌పై ఉన్న వారిని వెంబడిస్తూ.. కిందపడి గాయాలపాలైంది. దీంతో ఆమెకు తల, చేతులకు బలమైన గాయాలయ్యాయి. అయినా ధైర్యంతో దొంగల భారీ నుండి గొలుసును కాపాడుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి రాధాబాయి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement