బస్సు ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోవడంతో.. | women injured after falling out of emergency exit | Sakshi
Sakshi News home page

బస్సు ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోవడంతో..

Published Fri, Sep 9 2016 12:25 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

women injured after falling out of emergency exit

తిరుపతి: వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులోని అత్యవసర ద్వారం అకస్మాత్తుగా తెరుచుకుంది. దీంతో పక్కనే కూర్చుని ఉన్న మహిళ అందులో నుంచి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తిరుపతిలోని అలిపిరి వినాయక ఆలయ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. టీటీడీలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న వాణి(35) ఆర్టీసీ బస్సులో వెళ్తూ ప్రమాదవశాత్తు అత్యవసర ద్వారం తెరుచుకుంది. దీంతో ఆమె అక్కడ నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement