కోతుల దాడితో భయపడిన ఓ గర్భిణి భవనం నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన సంఘటన మెదక్ మండలం బ్యాతోల్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.
మెదక్ రూరల్: కోతుల దాడితో భయపడిన ఓ గర్భిణి భవనం నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన సంఘటన మెదక్ మండలం బ్యాతోల్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తొనిగండ్ల స్రవంతి ఐదు నెలల గర్భిణి. సాయంత్రం వేళ తన భవనంపై ఆరబెట్టిన బట్టలను తెచ్చేందుకు పైకి ఎక్కింది.
దీంతో కోతులు స్రవంతిపై దాడి చేశాయి. భయపడిన ఆమె వాటి నుంచి తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో స్రవంతి రెండు చేతులు విరిగిపోయాయి. వెంటనే కుటుంబీకులు హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.