జగిత్యాల రూరల్: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఓ యువతి పట్టుదలతో చదివి, మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని చెప్యాల గ్రామానికి చెందిన ముదుగంపల్లి భారత–చంద్రయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
పెద్ద కూతురు స్రవంతికి వివాహం కాగా, రెండో కూతురు జయ మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. పదోతరగతిలో మంచి మార్కులు తెచ్చుకొని, బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించింది. అక్కడ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, గేట్‌లో మంచి ర్యాంక్ ద్వారా హైదరాబాద్ జేఎన్‌టీయూలో ఎంటెక్ పూర్తి చేసింది. ఇటీవల వెలువడిన పంచాయతీరాజ్ శాఖ ఏఈఈ, మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైంది. ఏఈఈ ఉద్యోగంలో చేరతానని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment